“బ్రహ్మర్షి పత్రీజీ ఈ-బుక్స్”
|
|
శ్రీకృష్ణ సందేశంయోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ | సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వాసమత్వం యోగ ఉచ్యతే || ‘యోగ స్థితి’ లోనే కర్మలన్నీచేయాలి ! ‘యోగస్థితి’ లో వుండకుండా చేసే కర్మలన్నీ అనర్ధహేతువులే ! కర్మలను చేస్తూ వున్నా వాటిపట్ల ఆసక్తి రహితుడిలాగా వుండాలి. |
|
నవవిధ ధర్మాలు“ధర్మోరక్షతి రక్షితః” .. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారిచేత రక్షించబడిన ధర్మం తిరిగి వారిని రక్షిస్తుంది” అన్నది సత్యం. ఈ ప్రపంచంలో రకరకాల ధర్మాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటి గురించి మనం సమగ్రంగా తెలుసుకుంటూ.. సంపూర్ణ అవగాహనతో వాటిని ఆచరిస్తూ… ఈ భూమి మీద మన జీవితాలను పండించుకోవాలి. జీవితంలో మనకు అభ్యుదయం రావాలన్నా, మనం ప్రగతి పధంలో ఉండాలన్నా, మనకు సౌఖ్యం, ఆనందం, ముక్తి, మోక్షం దుఃఖరాహిత్యం.. ఒకటేమిటి ఏది కావాలన్నా సరే.. త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరించడం తప్ప మనకు వేరే మార్గం లేదు గాక లేదు కనుక ఇంతగా మన జీవితాల్లో … |
|
ధ్యానానుభవాలుధ్యానం చేస్తే ధ్యానానుభవాలు వస్తాయి. హైదరాబాద్‌కి వస్తే హైదరాబాద్ విశేషాలన్నీ చూడవచ్చు. ఇక్కడి వారందిరితోనూ మాట్లాడవచ్చు. హైదరాబాద్‌కే రాకపోతే ‘చార్మినార్’ ఎలా చూస్తాం? ‘ట్యాంక్‌బండ్’ ఎలా చూస్తాం? ఇక్కడున్న వాళ్ళతో ఎలా మాట్లాడుతాం? కనుక, ముంబాయికి వెళ్తే ముంబాయి విశేషాలూ. ముంబాయి అనుభవాలూ ఉంటాయి. కలకత్తాకు వెళ్తే కలకత్తా అనుభవాలూ వస్తాయి. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ అనుభవాలు వస్తాయి. అలాగే, ధ్యానం చేస్తే ధ్యానానుభవాలు వస్తాయి. |
|
ఆత్మవిజ్ఞానం
ఆత్మ విజ్ఞానం స్పిరిచ్యువల్ సైన్స్ – అంటే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం – అదే “ఆత్మవిజ్ఞానం”. ‘జ్ఞానం’ అన్నది వేరే. ‘విజ్ఞానం’ అన్నది వేరే. ‘జ్ఞానం’ అన్నది విజ్ఞానం యొక్క సూక్ష్మరూపమైతే, ‘విజ్ఞానం’ అన్నది జ్ఞానం యొక్క విశ్వరూపం. ఆత్మ యొక్క స్థూల అవగాహన ‘జ్ఞానం’; అయితే ఆత్మ యొక్క విశేష పరిస్థితులను ‘విజ్ఞానం’ లోనే తెలుసుకుంటాం. |
|
పిరమిడ్ జ్ఞాన నవరత్నాలుజ్ఞాన ప్రకరణం మొట్ట మొదటిది – “ఆత్మే పరబ్రహ్మము” | రెండవది – “జీవుడే దేవుడు” మూడవది – “దేహమే దేవాలయం” సాధనా ప్రకరణం నాల్గవది – “శ్వాసే గురువు” | ఐదవది – “సమయమే సాధన” ఆరవది – “సహనమే ప్రగతి” | ఏడవది – “అనుభవమే జ్ఞానం” కర్మ ప్రకరణం ఎనిమిదవది – “దానమే ధర్మం” | తొమ్మిదవది – “ధర్మమే పుణ్యం” |
|
భక్తియే… ముక్తి!“స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య భిధీయతే!” అని ఉపనిషత్ వాక్యం. అంటే స్వస్వరూపంలో అనుసంధానం… నాతో నేను ఉండడం.. నా గురించి నేను తెలుసుకోవడం, నేను నేనుగా ఉండడం దాని పేరే భక్తి. “స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య భిధీయతే!”… ఇది చాలా, చాలా ముఖ్యమైంది. భక్తి అంటే ఇంకెవడికో మరి మ్రొక్కడం, “బాంచను దొరా కల్మొక్త!” అనడం కాదు. భక్తి అంటే నీ యొక్క శక్తిని తెలుసుకొని ఆ శక్తితో కలిసి ఉండటమే. భక్తి అంటే స్వభక్తి… పరభక్తి కాదు. ధర్మం అంటే స్వధర్మం… పరధర్మం కాదు. వశం అంటే స్వవశం కావాలి… పరవశం కారాదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్… భక్తి అంటే స్వంతానికి శరణాగతి కావడం… పరులకు శరణాగతి కావడం కాదు. భక్తియే ముక్తి. స్వస్వరూపానుసంధానమే ముక్తి! ఎక్కడ భక్తి లేదో అక్కడ ముక్తి లేదు. ఎక్కడ స్వస్వరూపానుసంధానం లేదో అక్కడ ముక్తి లేదు! భక్తియే ముక్తి! |
|
ఆత్మ క్షేత్రంసంగీత క్షేత్రముంది. క్రికెట్ క్షేత్రముంది. హాకీ క్షేత్రముంది. ప్రతి ఆట కూడానూ… అదొక పెద్ద క్షేత్రం. సంగీతం నేర్చుకోవాలంటే మరి దానికి మన యొక్క సంసార క్షేత్రం నుంచి బయటికి వచ్చి సంగీత క్షేత్రం లోకి రావాలి. “నేను సంసార క్షేత్రంలో ఉన్నాను. నా పెళ్ళాం, బిడ్డలు ఉన్నారు. నేనెలా సంగీతం నేర్చుకుంటాను?” అంటే, నువ్వెలా నేర్చుకుంటావు? ఒక్ క్షేత్రంలో నుంచి ఇంకొక క్షేత్రంలోకి వెళ్ళాలంటే ఆ క్షేత్రం నుంచి బయటికి రావాలి కదా! శరీర క్షేత్రం నుంచి బయటికి వస్తేనే ఆత్మక్షేత్రం మనకి సువిదితమవుతుంది!
|
|
“ఆధ్యాత్మిక శాస్త్రం”“ఆధ్యాత్మిక శాస్త్రం” అన్నది ఆరు సత్యాలతో … ఆరు సిద్ధాంతాలతో … విరాజిల్లుతోంది. ఈ ఆరింటినీ వెరసి “ఆధ్యాత్మిక శాస్త్రం”గా మనం అర్ధం చేసుకుందాం. ఏదైతే మనకు అర్ధం అవుతుందో, వెంటనే అది మన చేత జీవింప బడుతుంది. దేనినైతే మనం అర్ధం చేసుకుంటామో, దేనినైతే మనం అవగాహన చేసుకుంటామో దానినే మనం జీవిస్తాం. ఏదైతే మన అవగాహనకు రాదో, మన వల్ల అర్ధం కాబడదో దానిని మనం జీవించలేం కదా? అర్ధం చేసుకుంటే, అవగాహన కలిగి వుంటే, మెదడుకు అది ఎక్కితే… మన జీవితంలో దాని ఆచరణ తనంతట తాను, సహజంగా వచ్చేస్తుంది… (ఈ కంటెంట్‌ను బ్రహ్మర్షి పత్రీజీగారి “ఆధ్యాత్మిక శాస్త్రం” ఆడియో నుండి సేకరించబడింది) |
|
“ఆనందోబ్రహ్మ”“మానవుడి జీవితం ఎందుకు?”; “మనం ఎందుకు జీవించాలి ?”, “మనం ఎందుకు జీవిస్తున్నాం ?”; “ఈ జీవితం ఎందుకు ?”, “ఇంత చిత్రవిచిత్రమైన ప్రకృతి నిర్మాణం ఎందుకు?”, “ఇన్ని రకాల జీవరాసులు ఎందుకు?”, “సృష్టి కార్యక్రమం అంతా ఎందుకు?” అన్నవి మౌలికమైన ప్రశ్నలు. ఎంతో మంది మేధావులు, ఎంతోమంది యోగులు, ఋషులు, ద్రష్టలు, అందరూ కూడా యుగయుగాలుగా ఇలాంటి ప్రశ్నలు వేసుకుని అనేకనేక పరిశోధనలు చేసి, ధ్యాన సాధనలు చేసి, జ్ఞాన చర్చలు జరిపి తెలుసుకున్న మౌలికమైన సమాధానం ఏమిటంటే – “జీవితమన్నది ఆనందంగా వుండడానికే; జీవితమన్నది నిత్యమూ సుఖంగా జీవించడానికే”… (ఈ కంటెంట్‌ను బ్రహ్మర్షి పత్రీజీగారి “ఆనందోబ్రహ్మ మొదటి భాగం“, “ఆనందోబ్రహ్మ రెండవ భాగం” ఆడియోల నుండి సేకరించబడింది) |
|
“ఎన్లైటెన్మెంట్ అంటే?““ఎన్లైటెన్మెంట్ స్టేట్” అంటే “సరి అయిన పరిణితి చెందిన మానవ వ్యవహార శైలి”. ప్రపంచంలో సగటు మానవుడు ‘పుడ్తాడు’, ‘పెరుగుతాడు’; ‘తింటాడు’, ‘నిద్రపోతాడు’; ‘చస్తాడు’. అంతే కానీ తన జీవితాన్ని తాను విశేషంగా విశ్లేషించ ప్రయత్నించడు. “ఏదో ఒక సామాజికుడు” గా, “ఏదో ఒక సంఘ సభ్యుడు” గానో వుంటాడే కానీ, ఒక విలక్షణమైన సభ్య సామాజికుడుగా ఉండ నిర్ధారించుకోడు. కానీ ఒక ఎదిగిన మానవుడు, ఒక పరిణితి చెందిన మానవుడు “నేను ఏ విధంగా జీవించాలి ?”, “ఏ విధమైన జీవన సరళి సరి అయినది ?” – అని తెలుసుకోవడానికి ఉబలాటపడతాడు, ఆ పద్ధతి తెలుసుకుని ఆ విధంగా జీవిస్తాడు. ఆ వ్యక్తికి “ఎన్లైటెన్మెంట్ ఉంది” అని మనం చెప్పుకుంటాం… (ఈ కంటెంట్‌ను బ్రహ్మర్షి పత్రీజీగారి “ఎన్లైటెన్మెంట్ అంటే మొదటి భాగం“, “ఎన్లైటెన్మెంట్ అంటే రెండవ భాగం” ఆడియోల నుండి సేకరించబడింది) |
|
“అప్పో దీపో భవ”“అప్పో దీపో భవ” అన్న సూత్రం తెలియకే అందరూ సతమతమవుతున్నారు, దుఃఖంతో జీవిస్తున్నారు. గౌతమ బుద్ధుడు తన జీవిత చివరి దశలో ఆఖరి శ్వాస వదిలి పెట్టే ముందర తన శిష్యుడు ఆనందుడికి ఇచ్చిన ప్రబోధం. ఈ మాటల తర్వాత బుద్ధుడు మాట్లాడలేదు. ఆ చివరి మాటలు ఆయన యొక్క పదాలలో “అప్పో దీపో భవ”, అంటే పాళీ భాషలో “ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి”, “ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మన జీవితాన్ని ఇంకొకళ్ళ చేతుల్లో పెడితే ‘వాళ్ళు ఉద్ధరిస్తారులే’ అని మనం అనుకుంటే వారి మీద ఆధారపడితే … కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే ! అన్నాడు గౌతమ బుద్ధుడు. |
|
“వాక్ క్షేత్రం – 1“మానవ జీవితం త్రిక్షేత్రమయం. మానవ ప్రపంచం త్రిక్షేత్రాత్మకం. “త్రిక్షేత్రం” అంటే “మూడు క్షేత్రాలు”. “త్రిక్షేత్రమయం” అంటే “మూడు క్షేత్రాలలో నిండి ఉంది”. అంటే 1. భావనలు 2. వాక్కులు 3. చేష్టలు “మానవ జీవితం” విస్తారమైన “భావనల క్షేత్రం”; విస్తారమైన “వాక్ క్షేత్రం”; విస్తారమైన “చేష్టాక్షేత్రా” లతో నిండి ఉంది. ప్రతి మానవుడూ తన స్వంత జీవితాన్ని అర్ధం చేసుకుంటేనే కానీ జీవితంలో ఆనందాన్ని పొందలేడు. సమర్ధతకి నోచుకోలేడు. కనుక “తాను ఏమిటో?” తాను తెలుసుకోవాలి… (ఈ కంటెంట్‌ను బ్రహ్మర్షి పత్రీజీగారి “వాక్ క్షేత్రం మొదటి భాగం“, “వాక్ క్షేత్రం రెండవ భాగం” ఆడియోల నుండి సేకరించబడింది) |
|
“యోగ పరంపర”“రజోగుణ” పరంపరలో కొన్ని జన్మలు వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు సాత్వికమైన గుణం, అంటే – “నేనేం చేయాలి?”, “జీవితంలో ఎలా జీవించాలి?”, “ఆనందంగా వుండాలి అంటే ఏం చేయాలి?” అని ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ తమోగుణంలోనూ, రజోగుణంలోనూ ఎన్నో కష్టాలు కూడా అనుభవిస్తూ వుంటాడు. ఎన్నో నష్టాలు కూడా అనుభవిస్తూ వుంటాడు. ఎన్నోబాధలు అనుభవిస్తూ వుంటాడు. అలా అనుభవించీ, అనుభవించీ ఈ సాత్విక గుణ పరంపరలోకి వచ్చిన తర్వాత – “ఇక బాధలు అనుభవించకూడదు అంటే నేను ఏం చేయాలిప్పుడు?” అన్న జ్ఞానం మెల్లిగా అంకురిస్తుంది. అక్కడి నుండి మొదలవుతుంది ప్రతి మనిషికీ “యోగ పరంపర”… (ఈ కంటెంట్‌ను బ్రహ్మర్షి పత్రీజీగారి “యోగ పరంపర మొదటి భాగం“, “యోగ పరంపర రెండవ భాగం ” ఆడియోల నుండి సేకరించబడింది) |