యోగిరాజ శ్యామాచరణ లాహిరి

 

 

20వ శతాబ్దపు మధ్య భాగంలో భారతదేశాన్నీ, అమెరికానూ, మరి యావత్ ప్రపంచాన్నీ ఆధ్యాత్మిక పరంగా, యోగపరంగా పరుగులెత్తించిన మహనీయుడు శ్రీ యోగానంద పరమహంస.

గురు శిష్యుల సంబంధం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా యోగానంద పరమహంసను తీర్చిదిద్దిన ఆయన గురువు శ్రీ యుక్తేశ్వర గిర్ గారిని అంతటి గురువు గా తీర్చిదిద్దిన పరమ గురువే శ్రీ శ్యామాచరణ లాహిరి.

శ్వాస క్రియను గమనించాలి – ముక్తిని పొందాలి – దివ్య శక్తులను పొందాలి – అన్న సిద్ధాంతాలను సంసార బాధ్యతలను అన్నింటినీ నిర్వర్తిస్తూనే, సంసార సుఖాలన్నింటినీ పొందుతూనే, తనతో పరిచయమైన ప్రతి వ్యక్తికీ చాటి చెప్పిన మహనీయుడు శ్రీ శ్యామాచరణ లాహిరి, అంటే, ఆయన నిఖార్సైన, సిసలైన పిరమిడ్ మాస్టర్ అన్నమాట.

భూమండలానికి ఆధ్యాత్మిక హెడ్‌క్వార్టర్స్ అయిన హిమాలయ శ్రేణిలోని పరమ గురుమండలిలో మనకు తెలిసినంత వరకూ అగ్రగణ్యులైన వారే శ్రీ మహావతార్ బాబాజీ – సుమారు 5,000 సం||లుగా భౌతిక శరీరంలో వుంటున్న యోగీశ్వరుడు.

అయన ప్రియతమ శిష్యుడే శ్రీ లాహిరి, గృహస్థాశ్రమంలోనే ఉంది అందరూ యోగ్యులై విలసిల్లాలి అన్నదే శ్రీ బాబాజీ ఆదేశం.

ఇదే అన్ని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల ముఖ్య ఆశయం కూడా, ఈ యోగుల పరంపరకు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్స్ అందరి తరపున, మరి ప్రపంచ ధ్యానుల అందరి తరపున శతకోటి వందనాలు.