యోగి

 

“యోగి”
అంటే ఎవరో
యోగి వేమన చక్కగా చెప్పారు :

“ఎచట నుంచి వచ్చు నెచటికి దాబోవు ?
నిద్ర చంద మెరుగ నేర్చనేని
ఆత్మరాకపోకలతడె పో శివయోగి
విశ్వదాభిరామ వినుర వేమ”

“ఆత్మ” అంటే
“దేహం” కన్నా భిన్నంగా వున్న “దేహి” ;
అంటే “బల్బు” లో ప్రసరిస్తున్న “కరెంటు” లాంటిది

“ఆత్మ” ను గురించి తెలియజేసేదే “యోగవిద్య” . .
“యోగవిద్య” నెరిగిన వాడే “శివయోగి”

“మనం ఏ లోకాల నుంచి వచ్చాం? ”
“చనిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాం ?”
“అసలు నిద్ర అంటే ఏమిటి?”
“ఆత్మ రాకపోకలు ఎలా జరుగుతాయి ?”
. . ఇలాంటి వాటన్నింటి గురించీ
సక్రమ ధ్యానాభ్యాసం లో
తెలుసుకోవలసిన వాటినన్నింటినీ తెలుసుకున్నవాడే “యోగి”

వేమన మహాయోగి ;
మనం కూడా మహాయోగులం కావాలి.