యమ నియమాలు

 

“యమం” అంటే, “నియంత్రణ” .. “కంట్రోలు” 
మౌలిక ఆధ్యాత్మిక – జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి వుండడం
పతంజలి మహర్షి అయిదు యమాలను ప్రవచించారు
అవి :
1. సత్యం : ఎప్పుడూ ఆత్మ సత్యాన్నే పలకడం
2. అహింస : హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం
3. బ్రహ్మచర్యం : ఎప్పుడూ మధ్యేమార్గాన్నే అవలంబించడం
4. ఆస్తేయం : ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం
5. అపరిగ్రహం : అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం

“నియమం”
అంటే తప్పనిసరి దైనందిక కార్యకలాపాలు
మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి
పతంజలి మహర్షి అయిదు నియమాలను ప్రవచించాడు .. అవి:
1. శౌచం : శరీరాన్నీ పరిసరాలనూ శుచిగా, శుభ్రంగా వుంచుకోవడం
2. సంతోషం : మనస్సును ఎప్పుడూ ఉల్లాసంగా వుంచుకోవడం
3. స్వాధ్యాయం : చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను సదా చదువుతూ వుండడం
4. తపస్సు : నిద్రాహారాదులను క్రమక్రమంగా తగ్గిస్తూ వుండడం
5. ఈశ్వరప్రణిధానం: “అంతా ఈశ్వరమయమే” అన్న భావనలో సదా వుండడం

యమ నియమాలు భౌతికజీవనంలో హస్తగతం కావాలి అంటే
నిత్య, అనునిత్య యోగం, ఆధ్యాత్మిక జ్ఞానం వినా వేరే శరణ్యం లేదు
* కనుక ” పతంజలి మహర్షీ , శతకోటి నమస్కారాలు, కరిష్యే వచనం తవ. “