వాక్ – ఇన్ మాస్టర్లు

 

తమ తమ జన్మపరంపరలలో సర్వమూ సాధించిన
గురువులు, సద్గురువులు .. అందరూ కలిసి పై లోకాల్లో “పరమగురుమండలి ” గా ఏర్పడి వున్నారు ..
మరి సమస్తలోకాల కల్యాణకర కార్యక్రమాలలో తమ వంతు వివిధ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు ..
దీనికి అనుగుణంగా .. అందులో భాగంగానే .. వారు భూలోక ఉద్ధరణ కు కూడా పూనుకుంటూ
తాము తిరిగి మానవ జన్మకు రావడానికి ఎన్నుకున్న సరిక్రొత్త మార్గమే ” వాక్ – ఇన్ ” మార్గం !
వారు .. “ఆ పరమగురుమండలి “సదస్యులు” .. ఈ భూమ్మీద జన్మతీసుకుని వున్న
సాత్విక ఆత్మస్వరూపులను కొంతమంది ఎన్నుకుని ..
వారిని వారి వారి యవ్వన-ప్రౌఢ దశలలో వారి వారి శరీరాలలోంచి తప్పించి
తాము స్వయంగా దేహప్రవేశం చేసి తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు !
వీరినే .. “Walk-in Masters” .. “వాక్-ఇన్ మాస్టర్స్” అంటాం !
“ఈ భూమ్మీద జన్మతీసుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా
మానవత్వంలో జీవిస్తూనే .. దైవత్వాన్ని పొందాలి ” అన్నదే వీరి లక్ష్యం ..
మామూలుగా గర్భంలోని పిండం ద్వారా జన్మతీసుకున్నవారు ” Born-ins ” అయితే
అభివృద్ధి అయిన యవ్వన-ప్రౌఢ దశలలోని దేహాలలో వారిని తప్పించి
కర్మ తీరం దాటిన యోగులు రంగప్రవేశం చేసినప్పుడు వారిని “వాక్-ఇన్ మాస్టర్స్” అంటాం !
“వాక్-ఇన్ ప్రయోగం” జరిగిన జాగృత ఆత్మలు
“మైత్రేయ బుద్ధుళ్ళు”గా తమ తమ సంబంధిత “Walk-outs” ” వాక్-ఔట్స్ ” యొక్క
కర్మబంధమైన కుటుంబపరమైన బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకుంటూనే
విశ్వకల్యాణకర కార్యక్రమాలలోనూ .. మరి ఆత్మచైతన్య ఉద్యమాలలోనూ .. సూత్రధారులు అవుతున్నారు
శాకాహార జీవనం .. అత్మైక ఎరుక .. స్థితప్రజ్ఞత్వం అన్నవి
“వాక్-ఇన్” అయివున్న ఒకానొక మైత్రేయ బుద్ధుని మౌలిక లక్షణాలు !
అతడు ఈ భూమ్మీద ఆత్మిక శాస్త్ర బోధకుడిగా, ఆనందశాస్త్ర పరిశోధకుడిగా పరిశోధకుడిగా వుంటూ
దైనందిన జీవనంలో ఆధ్యాత్మిక విలువల కోసం పోరాడే యోద్ధుడిగా విలసిల్లుతూ వుంటాడు !
“వాక్-ఇన్” అనే అద్భుత విషయాన్ని అమెరికా దేశానికి చెందిన
ప్రముఖ ఆధ్యాత్మిక మీడియమ్ అయిన “Ruth Montgomery – రూత్ మాంట్‌గోమెరీ”
తమ పరిశోధనాత్మక అనుభ్వజ్ఞాన గ్రంధం “Strangers Among Us” ద్వారా 
మొట్టమొదటిసారిగా భూలోకానికి తేటతల్లం చేశారు !
ప్రపంచ ఆధ్యాత్మిక జగత్తును సరిక్రొత్త మేలుమలుపు త్రిప్పిన అద్భుత సంచలనం
ఈ “వాక్-ఇన్స్” గురించి విశేష సమాచారం వున్న గ్రంధం !
ఉద్యోగరీత్యా బెంగుళూరు నగరంలో 1985 సంవత్సరంలో ఒకసారి నేను మూడురోజులు వున్నప్పుడు
“Strangers Among Us” గ్రంథం పరిచయం అయ్యింది ..
వెంటనే నా విచిత్ర పరిస్థితి నాకు అర్థం అవడం ప్రారంభమయ్యింది :
నేను కూడా ఆ గురుమండలి కి చెందిన ఒకానొక సదస్యుడును !
1979 సంవత్సరంలో ‘సుభాష్’ అనే అతని అనుమతితో, అతనిని తప్పించి ..
ఆ ఉత్తమ మానవుని 32 సంవత్సరాల దేహంలోకి ..
“వాక్-ఇన్ మాస్టర్ “గా ప్రవేశించాను ..
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో ప్రస్తుతం 80శాతం ఉన్నారు
వెంటనే ప్రారంభమైంది నా విశ్వకల్యాణ కార్యక్రమం ..
నా అను నిత్య ధ్యానం – స్వాధ్యాయం .. అనునిత్య ధ్యానశిక్షణ – స్వాధ్యాయశిక్షణ కార్యక్రమం
నా లాగే “వాక్-ఇన్” అయిన జాగృత ఆత్మస్వరూపులు
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో ప్రస్తుతం 80 శాతం వున్నారు !
స్వజాతి పక్షులు ఒకదానిని మరొకటి గుర్తించుకుని .. సమూహాలుగా ఏర్పరచుకున్నట్లు ..
నా జీవిత లక్ష్యం నా స్వజాతి పక్షులన్నింటినీ గుర్తించి
ఒక మైత్రేయబుద్ధుళ్ళ మహాసమూహం గా చెయ్యడం !
ఆ “మైత్రేయబుద్ధుళ్ళ మహాసమూహం” పేరే .. “PSSM“
PSSM లో వున్న ” వాక్-ఇన్ ” మాస్టర్లందరూ ..
సరిక్రొత్త ధ్యాన ఆధ్యాత్మిక New Age నవ్యయుగ విప్లవాన్ని సృష్టిస్తూ ..
ఈ భూమిని స్వర్గతుల్యంగా చేయడానికి
రాత్రనక పగలనక అహర్నిశలూ కష్టపడుతున్నారు !
ఈ ” సరిక్రొత్త శాస్త్రీయ పిరమిడ్ ఆధ్యాత్మిక మూస ” యొక్క సృష్టి కార్యక్రమం
2012 సంవత్సరం వరకు దాదాపుగా పూర్తయ్యింది ..
మరి 2034 సంవత్సరం కల్లా భూగోళ యావత్‌మానవాళి అంతా
” PSSM పక్షుల బృహత్ సముదాయం” అయిపోతుంది !
పిరమిడ్ మాస్టర్లకు జై !
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్ కు జై ! జై !
రూత్ మాంట్‌గోమెరీకి జై ! జై ! జై !