ఉత్తమ గురువులు
రకరకాల గురువులు
గురించి వేమన ఇలా చెప్పాడు:
“కల్ల గురుడు గట్టు కర్మచయంబులు-
మధ్య గురుడు గట్టు మంత్రచయము;
ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు–
విశ్వదాభిరామ వినురవేమ!”
మూర్ఖ గురువులు ప్రజలకు “కర్మలు” చేయడాన్నే ప్రోత్సహిస్తారు;
“కర్మలు” అంటే “బాహ్యపూజలు” అన్నమాట.
మధ్యమ గురువులు “మంత్ర, ఉపాసన”లకు శిష్యులకు పురిగొల్పుతారు;
“అదే పరమయోగం” అంటూ ప్రవచిస్తూ వుంటారు.
కానీ,
ఉత్తమ గురువులు “ధ్యానయోగం”ను మాత్రమే
అందరికీ, అన్నివేళలా ప్రబోధిస్తూ వుంటారు.
బాహ్యపూజలు చేయడం మూర్ఖత;
మంత్రజపం ‘మూర్ఖత’ కాదు కానీ, ‘పరమ యోగం’ కూడా కాదు!
అందులో దొరికేది మనస్సుకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే!
ధ్యానయోగమే అసలైన యోగం.
ధ్యానయోగ బోధకులే అసలైన గురువులు.