ఉపాసన – విపస్సన

 

 

“ఉపాసన”
అంటే “మంత్రయోగం”

దీనివలన దేవతా స్వరూపాలు
తప్పకుండా కనిపిస్తాయి
కానీ, ఆధ్యాత్మిక విజ్ఞానం చేకూరదు
‘మోక్షం’ రాదు

“విపస్సన”
అంటే, “ధ్యాన యోగం”
దీనివలన పరమగురువులను (మాస్టర్స్‌లను) ప్రత్యక్షంగా కలుసుకుని,
అన్ని తలాలూ తిరిగి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంతరించుకుంటాం

“ఉపాసన” మనల్ని కేవలం
ఆనందమయకోశం వరకు మాత్రమే తీసుకుపోగలదు
కానీ
“విపస్సన” మనల్ని
విశ్వమయకోశం, నిర్వాణమయకోశం వరకూ తీసుకువెళ్తుంది

ఉపాసనా మార్గం కనిష్ఠపక్షానికి చెందినది
విపస్సనా మార్గమే పరమయోగ్యమయినది