త్రిపుర సుందరి

 

“త్రిపుర సుందరి”
అంటే
“దేవతా మూర్తి” కాదు .. ” ఆత్మ పదార్థం “

త్రి = మూడు
పుర = పురాలలో ఉన్న
సుందరి = సుందరమైనది

మూలచైతన్యమే సుందరమైనది – ఇదే అసలు ” సుందరి ” 
అయితే
ఈ మూల చైతన్యం ప్రకృతి తత్త్వాలలో తాదాత్మ్యం చెందుతూ
క్రమక్రమంగా మూడు తొడుగులను సంతరించుకుంటుంది
1. కారణశరీరం 2. సూక్ష్మశరీరం 3. స్థూలశరీరం
ఈ మూడు శరీరాలే ” మూడు తొడుగులు ” .. ” మూడు పురాలు “
ఆత్మపదార్థం అన్నదే ఈ పాంచ భౌతిక లోకానికి వచ్చేసరికి
” త్రిపురసుందరి ” లా వెలుగుతోంది

” త్రిపురసుందరి “ ని ” బాల ” అని కూడా అభివర్ణిస్తారు
” బాల ” అంటే నిత్య నూతనమైనది ..
నిత్య యవ్వనమైనది .. నిత్య శోభాయమానమైనది
ఈ లక్షణాలు అన్నీ ఆత్మతత్త్వం యొక్క గుణగణాలను సూచిస్తాయి

అందుకే, శ్రీ త్యాగరాజు ఇలా గానం చేశారు 
” దారిని తెలుసుకొంటి – త్రిపుర సుందరిని తెలుసుకొంటి ” అని

ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి ఉన్నది ఒకే దారి
అదే ” ఆనాపానసతి ధ్యానం “