“తేజోగుణం జిందాబాద్”
“చేతినిండా పని” = “కంటి నిండా నిద్ర”
“చేతినిండా పని” = “ఒంటి నిండా ఆరోగ్యం”
“చేతినిండా పని” = “మనస్సు నిండా నిర్మలత”
“చేతినిండా పని” = “బుద్ధి నిండా వికాసం”
“చేతినిండా పని” = “ఆత్మనిండా తృప్తి”
చేతులు ముడుచుకుని
పనిచేయకుండా తిని కూర్చోవడం .. “తమోగుణం”
“ఈ పని రేపు చేస్తాను” అన్నది .. “తమోగుణం”
“నా వల్ల ఈ పని ఎలా అవుతుంది?” అన్నది .. “తమోగుణం”
“దేవుడు ఎప్పుడు తలిస్తే అప్పుడే అవుతుందిలే” అనుకుని
మిన్నకుండడం .. “తమోగుణం”
అలా కాకుండా
చేతినిండా రకరకాల పనులు పెట్టుకోవడం .. “రజోగుణం”
నిరంతరమూ రకరకాల ప్రాపంచిక పనులలో
మునిగి ఉండడం .. “రజోగుణం”
అయితే
రకరకాల ప్రాపంచిక పనులతో బాటు
అందరికీ లాభకారిగా ఉండే పనులు కూడా చేయడం .. “సాత్వికగుణం”
సర్వకుశలోపరిగా ఉండే పనులు చేయడం .. “సాత్విక గుణం”
ఎన్ని పనులు చేస్తున్నా
“అంతా శూన్యమే” అన్న ఎరుకలో సదా ఉండడం .. “నిర్గుణం”
“నేను శూన్యమే” .. “అందరూ శూన్యమే” అని తెలుసుకోవడమే “నిర్గుణం”
తేజోగుణం
“రజోగుణం” + “సాత్వికగుణం” = “తేజోగుణం”
“రేపటి పనులు కూడా ఇవాళే చేస్తాను” అన్నది“తేజోగుణం”
“నా వల్ల కాని మంచి పని సృష్టిలో లేదు” అన్నది “తేజోగుణం”
“నేను దేవుడిని .. ఏవైనా సరే .. ఎన్నైనా సరే .. అవలీలగా చేసేస్తాను”
అన్నది .. “తేజోగుణం”
తేజోగుణం జిందాబాద్!
తేజోగుణ సంపన్నులు
అందరిలో “ఆత్మతేజస్సు”ను సంపూర్ణంగా నింపే పనులు
“పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్”చేసే పనులు
పిరమిడ్ మాస్టర్స్ అందరూ “తేజోగుణ మహాసంపన్నులు”
ఒక ప్రక్క “నిర్గుణి”గా ఉంటూ .. రెండవ ప్రక్క “తేజోగుణి”గా ఉంటూ
అద్భుతమైన మధ్యేమార్గంలో సకల ప్రాపంచిక, ఆధ్యాత్మిక
పనులన్నీ చేస్తూండే వారే “PSSM మాస్టర్స్”
పిరమిడ్ మాస్టర్స్
క్షణం తీరికలేని వారు .. మరి ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండేవారు ..
“అపరా విద్య” నిష్ణాతులు .. మరి నిరంతర కృషీవలులు ..
సకల పరిస్థితులలోనూ ప్రశాంతచిత్తులై ఉండేవారు ..
అన్ని పరిస్థితులనూ తగు ఆధ్యాత్మిక విధంగా మలచుకునే
నిరంతర జ్ఞానపథగాములు .. “పిరమిడ్ మాస్టర్స్”