తీర్థయాత్ర – తరించటం

 

“జనులు దేనివల్ల తరిస్తారో” అదే “తీర్థం”

స్వంతాన్ని తరింపచేసుకునే ప్రయత్నాలే “తీర్థయాత్రలు” అన్నమాట.

“జనాః యై స్తరంతి తాని తీర్థాని”

అన్నది మూలసూత్రం

“తరించటం” అంటే ? ?

” ‘తీరం’ దాటడం “

ఏ తీరం ? ?

“తాపత్రయం” అనే తీరం నుంచి

“తాపత్రయ రహితం” అనే తీరాన్ని చేరుకోవడమే “తరించడం”

ధమ్మపదంలో బుద్ధుడు ఇలా చెప్పాడు:

అప్పకా తే మనుస్సేసు యే జనా పారగామినో”

అథాయం ఇతరా పజా, తీరమేవాను ధావతి”

“ఆవలి తీరం చేరేవారు మనుష్యులలో కొందరు మాత్రమే:

ఇతరులు తీరం వెంబడే పరుగెత్తుతున్నారు” అని

  • “సత్సంగం” . . అంటే “ధ్యానం” . . అది మాత్రమే ప్రత్యక్షంగా “తీర్థయాత్ర”
  • సజ్జన సాంగత్యం, సద్గ్రంధ పఠనం – 
    ఇవి రెండే పరోక్షంగా “తీర్థయాత్రలు” అనిపించుకుంటాయి.