తనువు – ఆత్మ
“కట్టె యందు నిప్పుగానని చందమే
తనువు నందు ఆత్మ తగిలి యుండు ;
మఱుగు దెలిసి పిదప మార్కొనవలెనయా
విశ్వదాభిరామ వినుర వేమ”
–యోగి వేమన
“రెండు కట్టెలు ఒరిపిడి వలన నిప్పు రాలుతుంది ;
కట్టెలు నిప్పు కనిపించకుండా ఉన్నట్లే
దేహంలో ఆత్మ వుంటుంది ;
ఈ రహస్యం తెలుసుకుని ఆత్మతత్త్వం లో మెలగాలి” . .
అని యోగి వేమన బోధ
కట్టెలు నరికితే ‘నిప్పు’ అన్నది కనబడుతుందా ?
విత్తనాన్ని విరగగొడితే ‘చెట్టు’ అన్నది బయటపడుతుందా ?
అట్లాగే,
శరీరాన్ని నరికితే ‘ఆత్మ’ అన్నది కనబడదు
చర్మచక్షువులకు కనబడనంత మాత్రాన
ఆత్మ అన్నది దేహంలో వ్యాపించి లేదని కాదు
“నా కంటికి చూపించు” అని సవాలు చేసేవారు మూర్ఖులు
కంటికి కనిపిస్తుంది . . అయితే ‘మూడో కంటి’ కి
* ఆత్మానుభవానికి దివ్యచక్షువు అన్నది తప్పనిసరి ;
అది ధ్యానం ద్వారానే సిద్ధం