తమో రజో సత్త్వ గుణాలు

 

గుణం” అంటే “అంతర్ పరిస్థితి”
కర్మ” అంటే “బహిర్ కార్యకలాపం”
మన గుణాన్ని బట్టే మన కర్మలు ఉంటాయి

కర్మల వల్ల గుణాలు కూడా మారుతూ ఉంటాయి

గుణం” , కర్మ” . . ఇవి రెండూ
పెనవేసుకున్న రెండు పాముల లాంటివి.

అంతర్ పరిస్థితిని బట్టి మనుష్యులను
తమోగుణప్రధానులుగా, రజోగుణప్రధానులుగా, సత్వగుణప్రధానులుగా,
శుద్ధసాత్వికులుగా, నిర్గుణులుగా విభజించవచ్చు.

తమోగుణప్రధానులు “కుంభకర్ణుడి” లాగా కేవలం
శారీరక అవసరాలకు మాత్రమే ప్రాముఖ్యత నిచ్చేవారు ;
కామమే ముఖ్యధ్యేయంగా వున్నవారు; కష్టాలు వస్తే ఆర్తనాదాలు చేసేవాళ్ళు

రజోగుణప్రధానులు “రావణాసురుడి” లాగా కీర్తికాముకులు ;
అంతులేని సుఖాలను వాంఛించే వారు ;
అందుకు ఎంతటి అధర్మానికైనా తెగించేవారు

సత్వగుణప్రధానులు ధర్మాభిలాషులు,
విభీషణుడి” లాగా బుద్ధిజీవులు, జ్ఞానయోగ జిజ్ఞాసువులు
ఇక, శుద్ధసాత్వికులు, నిర్గుణులు . . మోక్షసామ్రాజ్యాన్ని ఏలేవారు
వీరు పరిణితి చెందిన సీతాకోకచిలుకలు – “శ్రీరాముడి” లాంటి జ్ఞానులు, సిద్ధులు

  • మన అసలు ధ్యేయం శుద్ధసాత్వికులుగానిర్గుణులుగా త్వరగా మారడమే