తాపత్రయం
“తాపం” అంటే దుఃఖం; “త్రయం” అంటే మూడు
త్రివిధ దుఃఖాలనే “తాపత్రయం” అంటారు;
తాపాలు అన్నవి మూడు రకాలుగా ఉంటాయి;
- ఆధ్యాత్మిక తాపం:
మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనబడే
అరిషడ్వర్గాల వలన మనకు కలిగే బాధలనే “ఆధ్యాత్మిక తాపాలు” అంటాం;
ప్రతి మనిషికీ ఉండే ఇహలోక బాధల మొత్తంలో
నిజానికి 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకున్న,
మరి మనకు మనం కల్పించుకుంటూన్న బాధలే. - ఆదిభౌతిక తాపం:
ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలను “ఆదిభౌతిక తాపాలు” అంటాం.
మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన
మనకు కలిగే భౌతికపరమైన బాధలు అన్నమాట;
ప్రతి మనిషికి 9% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి. - ఆదిదైవిక తాపం:
ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలను
“ఆదిదైవిక తాపాలు” అంటాం . .
ఉదాహరణకు: అతివృష్టి, అనావృష్టి, అతిశీతలం, అతిఉష్ణం మొదలైనవి
అనేక బాధలను కలిగిస్తూ ఉంటాయి;
ప్రతి మనిషికి 1% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.
- మానవులందరికీ త్రివిధ దుఃఖాలు, తాపత్రయాలు ఉంటాయి.
- ఒకానొక ముక్తపురుషుడికి, ఒకానొక ధ్యానయోగికి, ఆధ్యాత్మిక తాపాలు ఉండవు; కేవలం ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు మత్రమే ఉంటాయి.