స్వేచ్ఛ– యాదృచ్ఛికం
అంతా “స్వేచ్ఛ” ప్రకారమే
జరుగుతోంది;
అంతేకానీ,
ఏదీ “యాదృచ్ఛికం” కాదు
“ఇచ్ఛ” అంటే “కోరిక” (ఎంపిక)
“యాదృచ్ఛికం” అంటే “ఛాన్స్” , “యధాలాపంగా జరిగింది”
“స్వ + ఇచ్ఛ” = “స్వేచ్ఛ”
“స్వంత ఇచ్ఛ” అన్నమాట
ప్రతీదీ స్వంత ఇచ్ఛతోనే జరుగుతోంది;
అంతేకానీ, ఇతరమైన దేనివల్లా కానేకాదు
“యాదృచ్ఛికం”
అన్నది సృష్టిలో లేనే లేదు
“మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు . .
ఎక్కడకు వెళ్ళినా, ఏ లోకంలో తిరిగినా” అన్నాడు ‘సేత్’
- “అంతా స్వేచ్ఛే” అనే పరమసత్యాన్ని గ్రాహ్యం చేసుకునే స్థితికి చేరుకోవాలి అంటే మనం మన దివ్యచక్షువును మౌలికంగా ఉత్తేజితం చేసుకునే తీరాలి.