సూక్ష్మశరీర యానం

 

 

ముండకోపనిషత్తులో సూక్ష్మశరీరయానం గురించి చక్కగా చెప్పబడింది:

యం యం లోకం మనసా సంవిభాతి

విశుద్ధ సత్తః కామయతే యాంశ్చ కామాన్,

తం తం లోకం జాయతే తాంశ్చ కామాం . . . . .”

-ముండకోపనిషత్ (3 – 10)

విశుద్ధ సత్వః = శుద్ధాంతఃకరణో మనిష్య
యం యం లోకంమనసా = ధ్యానేన
సంవిభాతిః = ఇచ్ఛతి
కామయతే యాంశ్చ కామాన్ = యంశ్చ మనోరధా నిచ్ఛతి తం తం లోకం తాంశ్చ కామాన్
జాయతే = ప్రాప్నోతి

 

“పరిశుద్ధమైన మనస్సు వున్న మనిషి ధ్యానంలో ఏ లోకాలను
కోరుకుంటాడో ఆ లోకాలను చూస్తాడు”

– స్వామి దయానంద – పండిత గోపదేవ్ ఆధారంగా

  • ‘ధమ్మపదం’ లో కూడా బుద్ధుడు ఇలా చెప్పాడు:
    “ఆకాసే యన్తి ఇద్దియా” – అంటే
    “యోగులు యోగసిద్ధి బలంతో ఆకాశంలో పయనిస్తారు” –
    అని బుద్ధుడి వచనం