సూత్రప్రాయం – ప్రబంధప్రాయం
మన వరకు మనం
“సూత్రప్రాయం” గా,
ధర్మాన్నీ, సత్యాన్నీ, ఆత్మజ్ఞానాన్నీ
తెలుసుకుంటే సరిపోదు
తదనంతరం,
“ప్రబంధప్రాయం” గా, మరింతగా, ఆత్మానుభవాన్నీ, ఆత్మజ్ఞానాన్నీ
విస్తరించుకోవాలి ;
తదనుగుణంగా మన దైనందిక వాస్తవాన్ని సంపూర్ణంగా సృష్టించుకోవాలి
అలాగే ప్రతి వ్యక్తికీ,
“సూత్రప్రాయం” గా,
సత్యం గురించీ, ధర్మం గురించీ,
ఆత్మజ్ఞానం గురించీ తెలుపడం మన అనివార్యమైన కర్తవ్యం
అంతేకానీ,
అందరికీ “ప్రబంధప్రాయం” గా వారి వారి దైనందిన వాస్తవాలను
కల్పింపబూనడం మాత్రం అవివేకం
“ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ |
ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః”
(భగవద్గీత 6-5)
“ప్రతి ఒక్కరూ ఈ సంసారం సాగరం నుంచి తమను తామే ఉద్ధరించుకోవాలి ;
తమను తాము ఎప్పుడూ అధోగతిపాలు చేసుకోకూడదు ;
వాస్తవానికి, ఎవరికి వారే శత్రువులు .. మరి ఎవరికి వారే మిత్రులు”
* ఎవరికీ వారే యమునా తీరే
* ఎవరికీ పడి పడి చేయరాదు.