శ్రీకృష్ణుడు – సహదేవుడు

 

“మహాభారతం” అంటే “పంచపాండవులు మరి శ్రీకృష్ణుడు
అయితే పంచపాండవులలో అతి గొప్ప పాత్ర .. “సహదేవుడు”
“సహదేవుడు” అంటే “దేవుడితో సరిసమానంగా ఉన్నవాడు”
“సహోద్యోగి” అంటే “తోటి ఉద్యోగి” .. “సహదేవుడు” అంటే “తోటి దేవుడు”
తోటి పెళ్ళికొడుకు .. తోటి పెళ్ళికూతురు లాగా!
శ్రీకృష్ణుడు “దేవుడు” అయితే సహదేవుడు “తోటి దేవుడు”
ఆ విధంగా కల్పన చేసి మహాభారత రచన సాగించారు శ్రీవేదవ్యాసుల వారు
కృష్ణునికి ఎంత తెలుసో సహదేవుడికి కూడా అంత తెలుసు ..
అయితే, సహదేవుడికి కృష్ణుడు హెచ్చరిక చేస్తాడు .. 
“ఏదీ ఎలా జరుగుతున్నా నోరు విప్పమాక .. అన్నింటికీ సాక్షీమాత్రంగా ఉండవోయ్ ..
లేకపోతే నాటకం రసాభాస అవుతుంది” అని!
“ఎంతటి త్రికాలజ్ఞాని అయితే అంతటి మౌనంలో ఉండాలి” అన్నదే సారాంశం 
మన యొక్క నిర్వాణం మరి మన యొక్క సంసారానికి అడ్డు రాకూడదు
మన యొక్క సంసారం మన యొక్క నిర్వాణానికి అడ్డు రాకూడదు
సంసారం సంసారమే .. నిర్వాణం నిర్వాణమే
రెండు గుర్రాల సవారీ వుండాలి!
“సహ” అంటే సహనం కూడా .. “సహ” అంటే సహకారం కూడా
“స” + “అహం” అంటే “అతడే నేనుగా ఉండేది” అని అర్థం
అంతులేని సహనంతో ఉండేవాడు “సహదేవుడు”
“తోటి వాళ్ళే నేను” అనే విధంగా అందరిపట్ల
ధర్మయుత సహకారంతో జీవించేవాడే “సహదేవుడు”
“సహదేవుడు” అనేవాడు అన్నీ తెలిసినా జ్ఞానపూరిత మౌనంలో ఉండే సిద్ధుడు!
పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక ప్రక్క కృష్ణుళ్ళు .. మరో ప్రక్క సహదేవుళ్ళు
“కృష్ణుడి” గా ఒక ప్రక్క గీతాబోధ చేస్తూంటారు ..
“సహదేవుడి”లాగా మరో ప్రక్క అన్ని విధాలా మౌనంగా, సహనంగా ఉంటారు ..
అన్నీ తెలిసినా .. ఏమీ తెలియనట్లు ఉండేవాళ్ళే పిరమిడ్ మాస్టర్లు
గత జన్మలన్నీ తెలిసినా .. వర్తమాన జన్మ పాత్రధారణకు
సరియైన ప్రాధాన్యత ఇచ్చి దానికి వన్నె తెచ్చేవారు!
PSSM యొక్క మొట్టమొదటి సిద్ధాంతం “ధ్యానం” అయితే
నాలుగవ సిద్ధాంతం “మౌనం” కనుక
ఇరవై అయిదు సంవత్సరాలుగా పిరమిడ్ మాస్టర్లు అందరూ
“కృష్ణుడి” – “సహదేవుడి” పాత్రలను విశేషంగా పోషిస్తున్నారు!
కృష్ణుడిలాగా “యోగీ భవ” అంటూ .. సహదేవుడిలాగా “మౌనీ భవ” అంటూ
తమతమ సంసారాలలో మౌనయోగీశ్వరుల్లా వెలుగుతూవున్నవారే పిరమిడ్ మాస్టర్లు!
గత ఇరవై అయిదు యేళ్ళుగా ఎంతో సహనంతో రాత్రనక పగలనక, అవిరామంగా,
దేశమంతా ధ్యానప్రచారం చేస్తూన్న గొప్ప దేవుళ్ళయిన .. 
గొప్ప సహదేవుళ్ళయిన పిరమిడ్ మాస్టర్లందరికీ
PSSM “రజతోత్సవాల” సందర్భంగా విశేష అభినందనలు!
Keep it up .. ! For the rest of this Life-Time ..! My dear Masters!!