శ్రేయస్సు – ప్రేయస్సు

 

“శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత

స్తా సంపరిత్య వివినక్తి ధీరః ;

శ్రేయోహి ధీరోభిప్రేయసోవృణీతే

ప్రేయోమందో యోగక్షేమాత్ వృణీతే”

= కఠోపనిషత్తు (2-2)

“శుభకరమైనదీ, సుఖకరమైనదీ . . ఈ రెండూ మానవుని సమీపిస్తాయి;

బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి వివేచిస్తాడు;

సుఖకరమైన దానికంటే శ్రేయస్కరమైనదే మేలు అని ఎన్నుకుంటాడు;

కానీ, బుద్ధిహీనుడు లోభం చేతా, ఆసక్తి చేతా సుఖకరమైన దానినే కోరుకుంటాడు”

(= రామకృష్ణ మిషన్ ప్రచురణ)

ప్రతిక్షణమూ, మనకు రెండు మార్గాలు ఎదురవుతూ ఉంటాయి

అవే శ్రేయో, ప్రేయో మార్గాలు

“శ్రేయస్సు” అంటే “శ్రేయస్కరమైనది”;

“ప్రేయస్సు” అంటే “ప్రియమైనది”

  • శ్రేయస్సులో సదా నిమగ్నుడైన వాడే ఉత్తముడు, ధీరుడు
  • ప్రేయస్సులో సదా నిమగ్నుడైన వాడే మందబుద్ధి కలవాడు
  • కేవల ప్రేయస్సులో శ్రేయస్సు శూన్యం; కానీ శ్రేయస్సు ఎప్పుడూ ప్రేయోసహితమైనదే