శ్రీ రమణ మహర్షి

 

భారతదేశ ఆధ్యాత్మిక ముద్దుబిడ్డలలో అగ్రగణ్యుడు రమణ మహర్షి.

పసితనంలోనే జ్ఙానోదయం అయినవాడు..

చిన్నతనంలోనే బంధ విముక్తుడు కావాడానికి ఉర్రూతలూగిన వాడు.

జీవితంలో ఒక్క పలుకు కూడా వృధా పరచలేదు ఈ మహర్షి..

ఆత్మనిష్టలో, బ్రహ్మ నిష్టలో ప్రతి క్షణం జీవించినవాడు.

నేనెవరు? అనే మహా ప్రశ్న యొక్క విచారణకూ, ఆ మహా ప్రశ్న యొక్క నిరంతర

విశ్లేషణకూ అవతారరూపులైనవారే రమణ మహర్షి.

తాను ఎవరో తాను తెలుసుకుని జీవించే జీవితమే దివ్య జీవితం.

తాను ఎవరో తనకు తెలియకుండా జీవించే జీవితం అడుగడుగునా భయాందోళనలమయం..

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ యొక్క ధ్యానులందరూ తమను తాము సంపూర్ణంగా ఎరిగినవారు.. ఆ విధంగా దివ్య జీవితాన్ని అనుక్షణమూ అనుభవిస్తున్నారు.

నేను ను తెలుసుకోవాలంటే చిత్తం పూర్తిగా వృత్తి శూన్యం అవ్వాలి. అప్పుడుఒక క్రొత్త నేను ఆవిర్భవిస్తుంది. అది విశ్వమంతా తానే అయివున్న నేను, సృష్టి అంతా తానే అయివున్న నేను, ఏదయితే ప్రథమ సృష్టి కర్తో అదే తాను అయివున్న నేను..

ఏదైతే రమణ మహర్షి గారికి సుసాధ్యమో అది అందరికీ సుసాధ్యమే..

ఆధ్యాత్మిక సూత్రాలు అన్ని దేశాలలోనూ, అన్ని కాలలలోనూ, అన్ని ప్రదేశాల లోనూ అన్ని వర్ణ, కులాల, వ్యక్తులకూ సరిసమానంగా వుంటాయి.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారు ఆ మౌలిక ఆధ్యాత్మిక సూత్రాలను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నవారు. అవగాహన చేసుకుని ఆ సూత్రాలను అనునిత్యం అందరికీ ప్రభోధిస్తున్నవారు.

ప్రతి మనిషీ మహర్షి కావాలి.. మహర్షి అంటే మహా ఋషి అంటే గొప్ప ద్రష్ట అంటే గొప్ప మూడో కన్ను కలిగివున్నవాడు, అదే విధంగా ఇంకా ఎదిగి బ్రహ్మర్షి కావాలి; బ్రహ్మర్షి అంటే సృష్టి రచన అంతా తెలుసుకున్నవాడు. అందరూ మహర్షులుగా, బ్రహ్మర్షులుగా అయితీరాలి.

అందుకు”ఆనాపానసతి-విపస్సన” ధ్యాన విధానం ఒక్కటే మార్గం..