“Soul Lessons and Soul Purpose”
నిరంతర పరిణామక్రమంలో భాగంగా
ఈ భూమి మీద ప్రతి ఒక్క ఆత్మ కూడా
నాలుగు దశలలో పరిపూర్ణతను పొందవలసి ఉంటుంది
అవి వరసగా ..
1. నూతన – విద్యార్థి దశ .. (Student Stage)
2. ముముక్షు దశ .. (Apprentice Stage)
3. నైపుణ్యదశ .. (Journeyman Stage)
4. అధిపతిదశ .. (Master Stage)
నూతన – విద్యార్థిదశ: పూర్వపు దృష్టికోణానికి పూర్తి భిన్నంగా ..
ఆలోచనలను సంబంధించి మరి జీవనానికి సంబంధించి ..
సరిక్రొత్త సమాచారం ఆశ్చర్యంగా, విస్తృతంగా సేకరించబడుతుంది.
ముముక్ష దశ: ఏదేని ఒక అప్పగించబడిన పనికి సంబంధించి ..
అది ఇదివరలో చేసిందే అయినా ..
బుద్ధుని ఉపయోగించి సరిక్రొత్తగా మళ్ళీ చేయవలసి రావచ్చు;
అయితే “చేసిన పనినే మళ్ళీ చేస్తున్నాం” అన్న విసుగుతో ఆత్మ
మార్పును కోరుకుంటూ ఉంటుంది.
నైపుణ్య దశ: ఇలాంటి విసుగులన్నీ సమసిపోయి
తెలుసుకున్న ప్రతి విషయాన్నీ ఆత్మ ఆచరణలో పెడుతుంది;
“చేతల ద్వారా నేర్చుకోవడం” అన్నది ఈ దశలోనే మొదలవుతుంది.
“ఇది నాకే ఎందుకు అప్పగించబడింది?” అని రెండవ దశలో ఉన్న ఆత్మ ఆలోచిస్తే
“ఇది నేనే ఎందుకు చేస్తున్నాను?” అని మూడవదశలో ఉన్న ఆత్మ ఆలోచిస్తుంది!
నేర్చుకున్న పాఠాలను జీవితంలోకి అన్వయించుకోవడం ఈ దశలోనే ప్రారంభం అవుతుంది.
అధిపతిదశ : చేస్తున్న పని .. అది ఎంతటి సమస్య కారకమైనా ..
ఆత్మ దానిని సంపూర్ణస్థితిలో అంగీకరిస్తూ ..
తద్వారా వచ్చే అనుభవ జ్ఞానాన్ని అంతా
నిజజీవితంలో విలీనం చేసుకుంటూ ఉంటుంది.
దీనివల్ల సాధికారతతో కూడిన విశ్వాసంతో
సంబంధిత పనిలో ఆత్మకు “మాస్టరీ” సిద్ధిస్తుంది
జన్మ ప్రయోజనాన్ని సాధించిన ఈ పరిపూర్ణ దశలోని ఆత్మ ..
నూతన – విద్యార్థి దశలో ఉన్న ఆత్మలకూ .. ముముక్షు దశలో ఉన్న
ఆత్మలకూ మరి నైపుణ్య దశలో ఉన్న ఆత్మలకూ అత్యంత స్ఫూర్తిదాయకంగా
నిలుస్తుంది!!
( Sonia Choquette ఛానెల్డ్ గ్రంథరాజం “” Soul Lessons and Soul Purpose “
” నుంచి)