శివుడు – ఇద్దరు పెళ్ళాలు
శివుడు అంటే ఆనందమయుడు.
ఎప్పుడూ అనందంగా వుండేవాడే శివుడు.
ఇద్దరు పెళ్ళాలుంటేనే ఎప్పుడూ ఆనందంగా వుండేది.
ఒక పెళ్ళాం సరిపోదు.
మొదటి పెళ్ళాం – ప్రాపంచికం అయితే, రెండవ పెళ్ళాం – ఆధ్యాత్మికం.
మొదటి పెళ్ళాం పార్వతి అయితే రెండవ పెళ్ళాం ఆకాశ గంగ.
ఆకాశ గంగ అంటే కాస్మిక్ ఎనర్జీ – ఈ రెంటినీ ఎప్పుడూ ఉపయోగించుకుంటేనే ఎప్పుడూ ఆనందం.
అలా చేసే వాడే శివుడు.
కేవలం భౌతికత మీద కానీ, కేవలం ఆధ్యాత్మికత మీద గానీ ఆధారపడి వుండే వాళ్ళకు ఆనందం వుండేది యాభైశాతం మాత్రమే.
మనిషి నూటికి నూరు శాతం జీవించాలి.
పగలు ప్రాపంచికం ఉండాలి; రాత్రి ఆధ్యాత్మికం వుండాలి.
పగలు ఫిజికల్ బాడీని ఉపయోగించాలి; రాత్రి ఆస్ట్రల్ బాడీని ఉపయోగించాలి.
సంసారమే నిర్వాణం అన్నాడు కదా – మహా మేధావి నాగార్జునుడు.
సంసారం అంటే కేవలం భౌతికత్వమే కాదు;
ఆధ్యాత్మికం కూడా, అన్నది ఆయన ఆంతర్యం.
ఇద్దరు పెళ్ళాలతో చక్కగా సంసారం చేస్తేనే నిర్వాణం.
సంసారమే నిర్వాణం, సంసారమే నిర్వాణం, సంసారమే నిర్వాణం.