షట్చక్రాలు – సహస్రారం

 

నాడీమండల కాయంలో అతి ముఖ్యమైన ” చక్రాలు ”

1) మూలాధారం 2) స్వాధిష్టానం 3) మణిపూరకం 4) అనాహతం 5) విశుద్ధం 6) ఆజ్ఞా

అనేక నాడులు కూడిన పరిస్థితే ” చక్రం ” అనబడుతుంది ; ప్రతి ” చక్రం ” ఒక్కొక్క శరీరంతో ముడిపడి వుంది షట్చక్రాలూ, సహస్రారమూ ఏడు శరీరాలకు సంబంధించినవి

ఆనాపానసతి వలన కుండలినీ జాగృతమై, షట్చక్రాలలోనూ శుద్ధి జరుగుతుంది

“సహస్రారం” అన్నది చిట్టచివరి స్థితి ఇది మామూలుగా షట్చక్రాలలో లెక్కకి రాదు సహస్రారమే “సహస్రదళ కమలం”  ఇదే “వేయి పడగల పాము”

* కుండలినీ ఎప్పుడైతే సహస్రారంలో స్థితమవుతుందో, అప్పుడే నిర్వాణస్థితిని పొందామన్నమాట .. అంటే, నిర్వాణమయకోశం ఉత్తేజితం అయిందన్నమాట * నిర్వాణస్థితి పొందినప్పుడే దివ్యచక్షువును సంపూర్ణంగా సంతరించుకుంటాం