జేన్ రాబర్ట్స్ … సేత్
ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులలో
“ఐన్‌స్టీన్ – Einstein“
ఎలాంటివాడో
ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో అటువంటివాడు – “సేత్ (Seth)“
“జేన్ రాబర్ట్స్” మరి “రాబర్ట్ F. బట్స్” ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే “సేత్ జ్ఞానం” అన్న “ఆకాశగంగ”
“సేత్” అంటే ఒకానొక ఊర్థ్వలోక పూర్ణాత్మ
“జేన్ రాబర్ట్స్” అనే ఆవిడ ద్వారా 1965 నుంచి 1985 వరకు “ఛానెలింగ్” అంటే “స్వల్పకాలిక పరకాయ ప్రవేశం” అనే ప్రక్రియ ద్వారా పూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు.
“సేత్” పుస్తకాలు తెలుగులో లేవు మరి;
ఏం చేస్తాం ? అయితే –
ఇన్ని రోజులకు “అవిదిత యదార్ధం” అన్న పేరిట ఒక చిన్ని పుస్తకం మటుకు వచ్చింది –
భవిష్యత్తులో ఆయన పుస్తకాలు అన్నీ మన దేశ భాషలన్నింటిలో అనువాదం కావాలనే కలలు కంటున్నాను.
అయితే, అర్జెంటుగా, ఇప్పుడే “సేత్ జ్ఞానం” తెలుసుకోవాలి అంటే ఆంగ్లం వచ్చిన వారిని ఆశ్రయించక తప్పదు.
- సేత్ చెప్పిందే ఈ భూమి మీద ఇప్పుడు వున్న అత్యంతఅసాధారణమైన పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానప్రకాశం