శేషశయనుడు

 

శేషుడు = అది సర్పం
శేషశయనుడు = సర్పం మీద పడుకుని వున్నవాడు

” అది సర్పం ” అంటే కాలానికి ప్రతీక
అది కాలాన్ని సూచిస్తుంది
అందుకే ” కాల సర్పం ” , ” కాల నాగు ” అంటారు
ఆదిశేషుడుకి మరో పేరు ” అనంతుడు “
“నాకు ఇరవై యేళ్ళు ” .. ” నాకు అరవై యేళ్ళు”
అనే అనవగాహన లోంచి
సంపూర్ణంగా బయటపడి
“నేను అనంతకాలానికి చెందినవాడను”
అనే అవగాహనకు చేరిన వాడే
ఓ “శేషశయనుడు”

ఆత్మజ్ఞాన సంపన్నుడే ఓ ” శేషశయనుడు “
ఆత్మజ్ఞాన హీనుడే ” కాలం ” అనబడే
సర్పం లోపలి అంధకారంలో కొట్టుకుపోతున్నవాడు

 

* “నేను ఆత్మను” అని తెలుసుకోవాలి
“కాలం” అనే మాయలోంచి వైదొలగాలి