సత్యమే దైవం

 

సత్యం = దైవం

సత్యశోధన అంటే దైవశోధన .. దైవశోధన అంటే సత్యశోధన

సత్యసాధన అంటే దైవసాధన .. దైవసాధన అంటే సత్యసాధన

సత్యమే దైవం .. దైవమే సత్యం

ఎనెన్నో సత్యాలు

“ఆత్మ” అన్నది సత్యం

“ఆత్మశక్తి” అన్నది సత్యం

“శరీరం” అన్నది సత్యం

“వ్యక్తి” అన్నది సత్యం

“వ్యక్తిత్వం” అన్నది సత్యం

“కర్మ” అన్నది సత్యం

“కర్మఫలం” అన్నది సత్యం

“ఎన్నిక” అన్నది సత్యం

“ఎరుక” అన్నది సత్యం

 “మరుపు” అన్నది సత్యం

“పరస్పర ప్రభావాలు” అన్నది సత్యం

“నిరంతర మార్పు” అన్నది సత్యం

“అనేకానేక లోకాలు” అన్నది సత్యం

“అనేకానేక జీవులు” అన్నది సత్యం

“అనేకానేక అజ్ఞానాలు” అన్నది సత్యం

“అనేకానేక సుజ్ఞానాలు” అన్నది సత్యం

“అనేకానేక కోణాలు” అన్నది సత్యం

“అనేకానేక సందిగ్ధాలు” అన్నది సత్యం

సత్యం = దైవం

సత్యాన్ని గ్రహించనివాడే దైవాన్ని గ్రహించనివాడు

సత్యాన్ని గ్రహించినవాడే దైవాన్ని గ్రహించినవాడు

ఎంతగా సత్యాన్ని గ్రహిస్తే దైవాన్ని అంతగా గ్రహించినంత

సత్యం = దైవం

సత్యాసక్తే .. దైవాసక్తి

సత్యపిపాసే .. దైవపిపాస

సత్యారాధనే .. దైవారాధన

సత్యం శరణం గచ్ఛామి – సత్యం ఏవ శరణం గచ్ఛామి

సత్యం శరణం వయం – సత్యం ఏవ శరణం వయం