సరియైన దృక్పథాలు
“సరియైన దృక్పథాలు”
అంటే
ఈ క్రింది లాంటివి
‘నేను’ అనేది ‘శక్తి’ , ‘చైతన్యం’, ‘జ్ఞానం’ అనే మూడింటి సముదాయం.
భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ, చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు.
చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేవు;
చైతన్యానికి అసాధ్యం అన్నది లేనే లేదు.
ప్రతీదీ తాత్కాలికమే.
మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ స్వంత ఇచ్ఛతో సృష్టించుకుంటున్నాం.
‘భూతకాలం’ , ‘భవిష్యత్ కాలం’ అనేవి లేనే లేవు; ఉన్నది ఎల్లప్పుడూ ఒక్క వర్తమానకాలమే.
ఇలాగే ఇంకా, ఇంకా …….. ఎన్నో …….. ఎన్నో ……………
- ‘సరియైన దృక్పథాలు’ బుద్ధత్వ ప్రాప్తికి అంకురాలు
- ‘సరికాని దృక్పథాలు’ బుద్ధత్వ శూన్యతకు నిదర్శనాలు