సన్యాసం

 

“సమ్యక్ + న్యాసం = సన్యాసం.”
సమ్యక్ = సరియైన ; న్యాసం = త్యజించటం
సన్యాసం = సరియైన వాటిని త్యజించడం

“సన్యాసం” అన్నది నాలుగు రకాలు. . .

” మర్కట సన్యాసం “

చిన్న చిన్న కారణాలకే సన్యాసులుగా మారతారు. వున్న సంసారం వదిలిపెట్టేస్తారు. కొన్ని రోజులకు ఇంకో సంసారంలో తగులుకుంటారు. ఇది శూద్ర సన్యాసం.

“ఆపత్ సన్యాసం”

కాసేపటిలోనో, మరికాసేపటిలోనో చనిపోతానని తెలిసి స్వర్గంలో స్థానం పొందాలన్న ఆశతో సన్యాసం స్వీకరిస్తారు. ‘ ఆపద ‘ అంటే మరణ సమయంలో తీసుకునే సన్యాసం. ఇది వైశ్య సన్యాసం.

“క్షత్రియ సన్యాసం”

మేధోతత్వానికి చెందినవారు. సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆకాంక్ష, జ్ఞానతృష్ణతో … తమకున్న ప్రతిదానినీ త్యజించి … సన్యాసం స్వీకరిస్తారు. వివేకానందుని వంటివారు. ఇది క్షత్రియ సన్యాసం.

“విద్వత్ సన్యాసం”

అత్యున్నతస్థాయి … ఆత్మస్థాయి. అజ్ఞానాన్ని వదులుతారు తప్ప, సంసారాన్ని కాదు. దైనందిన జీవితంలో అనవసరమైన వాటిని వదిలిపెట్టి అవసరమైన వాటికి మాత్రమే పరిమితమౌతారు. ఇదే బ్రాహ్మణ సన్యాసం. అంటే సంసారంలోనే నిర్వాణం జోడించడం అన్నమాట. అంటే పిరమిడ్ మాస్టర్స్అన్నమాట.