సంసారం
“సంసారమే నిర్వాణం”
అన్నాడు
ఆచార్య నాగార్జునుడు
సంసారులకు ఓటమి ఎప్పుడూ లేదు ;
సన్యాసులకు గెలుపు ఎప్పుడూ లేదు
అందుకే,
పరమపదసోపానంలో కూడా
“సరస్వతీ బ్రహ్మలు” అనీ,
“పార్వతీ పరమేశ్వరులు” అనీ,
“లక్ష్మీ నారాయణులు” అనీ,
సంసారశ్రేష్టత గురించి నొక్కి చెప్పబడి వుంది
సంసారం నుంచి దూరంగా ఎప్పుడూ పరుగెత్తకూడదు;
సంసారంలో వుంటూనే సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి
“సమస్యలు” అన్నవి మనకు “సవాళ్ళు” ;
సవాళ్ళు ఉంటేనే పరిశ్రమిస్తాం ;
పరిశ్రమిస్తేనే మనకు పురోగతి, లేకపోతే ఎక్కడ వున్న గొంగళి అక్కడే.
అంతేకాదు,
సంసారం చేయడం అన్నది అత్యంత ప్రకృతి సహజం ;
సన్యాసం అన్నది ప్రకృతి సహజత్వానికి విరుద్ధం.
- సంసారం ఎప్పుడూ వదిలి పెట్టరాదు
- సంసారంలో వుంటూనే అసంగత్వాన్ని మేళవించాలి.