సమస్థితి

 

“ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు … అనేది ప్రాపంచిక నానుడి; అయితే ధ్యానం చేసి చూడు, పిరమిడ్ కట్టి చూడు … అన్నది నేటి పిరమిడ్ సొసైటీ యొక్క నానుడి”

“పిరమిడ్లు కట్టినవాళ్ళు సరాసరి సత్యలోకాలకు వెళ్తారు. తనకు తాను ధ్యానం చేయడం కన్నా పిరమిడ్లు కట్టి ఇతరులకు ధ్యాన ప్రోత్సాహం కలిగించడం అసాధారణ విషయం. పిరమిడ్లు కట్టినవారు ధ్యానంలో ఎంతో ఎత్తుకు ఎదిగినవారు.”

“పిరమిడ్ అన్ని కోణాలలో సమంగా వుంటుంది. అలాగే జ్ఞాని ఎప్పుడూ సమస్థితిలో వుంటాడు. పిరమిడ్ స్థిరంగా వుంటుంది. దానిలో ధ్యానం చేసేవాళ్ళని స్థిరపరుస్తుంది. పిరమిడ్ శక్తివంతమైనది. మనల్ని శక్తివంతులుగా చేస్తుంది.