సాధనా చతుష్టయం

 

 

ఆది శంకరాచార్యుల వారు
‘వివేక చూడామణి’ లో
“సాధనా చతుష్టయం” గురించి ప్రస్తుతించారు

సాధనలో నాలుగు అంశాలు వున్నాయి –
1. వివేకం 2. వైరాగ్యం 3. షడ్ సంపత్తి 4. ముముక్షుత్వం

నిత్యానిత్య వస్తు విచక్షణా జ్ఞానమే “వివేకం”,
ఇహ, ఆముత్ర కర్మ ఫల భోగ అనాసక్తే “వైరాగ్యం”

మోక్షప్రాప్తి కోరే తీవ్రసాధకుడి గుణగణాలే షడ్ సంపత్తి”
షడ్ + సంపత్తి = ఆరు సంపత్తులు
అవి దమము, సమము, తితీక్ష ఉపరతి, శ్రద్ధ, సమాధానాలు
బహిరేంద్రియ నిగ్రహం అన్నదే “దమం”
అంతరేంద్రియ నిగ్రహం అన్నదే “సమం”
బాధలను నోర్చుకునే గుణమే “తితీక్ష”
‘కామం’ నుంచి కొంత, సందర్భానుసారంగా, వైదొలగడమే “ఉపరతి”
త్రికరణశుద్ధి + దీక్ష = “శ్రద్ధ”
ద్వంద్వాలలో సమంగా చలించకుండా వుండడమే “సమాధానం “
ముక్తిని సదా, తీవ్రంగా, కోరుకోవటమే “ముముక్షుత్వం”

* ఒకానొక సాధకుడికి వివేకం, వైరాగ్యం, షడ్ సంపత్తి, ముముక్షుత్వం అనే నాలుగు
లక్షణాలు ఉన్నప్పుడే మోక్షప్రాప్తి అవుతుంది” ..
అన్నదే ఆదిశంకరాచార్యుల బోధ