సబ్కో సన్మతి
“హిందువులు వేరే … ముస్లింలు వేరే”… అన్న భావన గాంధీ మహాత్ముణ్ణి ఎంతగా కలచి వేసిందో, పాపం ఏడ్చాడాయన. ఎవరు హిందువు? ఎవరు ముస్లిం? అంతా ఒకటే. మానవులంతా ఒకటే జాతి. ఏ మతమూ వేరుగా లేదు. ఉన్నదంతా ఒకటే మతం. ఉన్నదంతా ఒకే ఆధ్యాత్మిక మతం. ఉన్నదంతా ఒకే దైవిక కుటుంబం.
“ఈశ్వరుడు వేరే … అల్లా వేరేనా? అంతా ఒకటే కదా. అని పాపం ఆయన వాపోయాడు.
మహాత్మ గాంధీజీ … జాతిపిత. “అహింసో పరమో ధర్మః” అన్న ఆయన “ఒక మనిషి మరొక మనిషిని చంపడం, నరకడం, రక్తం త్రాగడం … రామచంద్రా, ఏం జాతో, మతం పేరిట మారణహోమమా? హిందువులను చూస్తే ముస్లింలు సహించలేరు ముస్లింలను చూస్తే హిందువులు సహించలేరు. ఒక మనిషిని సహించలేని ఇంకొక మనిషి … అతనొక హిందువా? అతనొక ముస్లిమా? రామచంద్రా,” … అని ఏడుస్తున్నాడు మహాత్మా గాంధీజీ. అహింసకు అవతారమూర్తి మహాత్మా గాంధీజి. “హింసా ఛోడో” అన్న దానికి మారు పేరు మహాత్మా.
అయితే ఈ హింసను వదిలి పెట్టడానికి, మరి హంసను పట్టుకోవాడానికీ … అది మరి రెండవ మెట్టు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మాస్టర్లూ, ధ్యానులూ “హింసను వదిలిపెట్టేసి హంసను పట్టుకోండి”. అని ఆ రెండవ మెట్టును సూచిస్తున్నారు.
“మొట్టమొదటి మెట్టు” అంటే “అహింసో పరమో ధర్మః” అన్నదానితో అహింసాయుతంగా భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించింది.
మహాత్మా గాంధీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక. ఆయన ఏం ప్రార్ధించాడంటే “యావత్ జగత్తుకే సన్మతిని ప్రసాదించండి, స్వామీ.” అని.
వాస్తవానికి …
-
“సన్మతి” అంటే “సత్యంతో కూడుకున్న మతి.”
-
“సత్యం” అంటే “ఆత్మ.”
-
“ఏ మతి అయితే ఆత్మతో కూడుకుని ఉంటుందో” అది “సన్మతి.”
-
“అందరూ సర్వ సమానులే” అన్నదే “సన్మతి.”
-
“నేను ఈ శరీరం కాదు; నేను అన్నది ఆత్మ పదార్ధం” అని తెలుసుకున్నదే “సన్మతి.”
-
“ఎవరి వాస్తవానికి వారే సృష్ఠికర్తలు” అన్నదే “సమ్మతి.”
-
“మనం అనేక జన్మల పరంపరలో, అనేక కర్మల పరంపరలో, అనేక పాఠాల పరంపరలను నేర్చుకుంటున్నాము” అన్నదే, ఇది తెలుసుకోవడమే, “సన్మతి.”
-
“చెడు చేస్తే మనకు చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది” అని కర్మసిద్ధాంతం యొక్క మౌలిక ప్రభావాన్ని మన జీవితంలో తెలుసుకోవడమే “సన్మతి.”
-
“ఏ జంతువునూ చంపకుండా, సకల జంతువులనూ రక్షించాలి” అని తెలుసుకోవడమే “సన్మతి.”
“అందరికీ సన్మతిని ప్రసాదించండి భగవాన్.” అని ఆయన వేడుకొంటున్నారు. “సబ్ కో సన్మతి దే భగవాన్.” … సన్మతిని మనకు ఎవరిస్తారు ?? ఎవరి సన్మతిని వారే సంపాదించుకోవాలి గదా… “ఎలా??” అంటే …
-
ధ్యానం ద్వారా…
-
శ్వాస మీద ధ్యాస ద్వారా …
-
చిత్తవృత్తుల నిరోధం ద్వారా …
-
విశ్వప్రాణశక్తి ఆవాహన ద్వారా …
-
నాడీమండల శుద్ధి ద్వారా …
-
దివ్య చక్షువు ఉత్తేజితం ద్వారా …
… ఎవరి మతిని, ఎవరి సన్మతిని వారే తెచ్చుకోవాలి.
సృష్ఠిలో ఎక్కడా “ఇచ్చే నాధుడు” లేడు … “సంపాదించుకునే నాధులు” మాత్రమే ఉన్నారు.
మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మహాత్మా గాంధీజీ గారి యొక్క సంతతి ఈ భారతదేశం ఇకనైనా అవుగాక, ఇకనైనా అవుగాక, ఇకనైనా అవుగాక…