రిఛార్డ్‌బాక్
సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసానికి
సంపూర్ణ ప్రతిరూపం
రిఛార్డ్‌బాక్.
ఆయన పుస్తకాలు –
“జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ – Jonathan Livingston Seagull“;
“ఇల్యూషన్స్ – illusions“;
“బ్రిడ్జ్ అక్రాస్ ఫరెవర్ – Bridge Across Forever“;
“వన్ – One“;
“రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ – Running from Safety“
మొదలైనవి అసమాన ఆధ్యాత్మిక జ్ఞానమణులు.
ఉదాహరణకు, “ఇల్యూషన్స్”
అనే పుస్తకం లోంచి ఒక ఆణిముత్యం –
“ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ది డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్‌జస్టిస్ అండ్ ట్రాజెడీ.”
అంటే,
” ‘అన్యాయం’ , ‘విషాదం’ అనేవి ఉన్నాయని
మీరు ఎంత ప్రగాఢంగా నమ్మితే,
వాస్తవానికి అంతగా ‘అజ్ఞానం’ మీకు ఉందన్నమాట.” –
అని దీని మహాఅర్థం
- తింటే గారెలే తినాలి; చదివితే రిఛార్డ్ బాక్ పుస్తకాలే చదవాలి.