రెండు ఉన్నాయి
రెండు ఉన్నాయి
ఒకటి మనకు తెలసినది, రెండవది మనకు తెలియనిది
ఒకటి పాంచభౌతిక జ్ఞానేంద్రియ సహితమైనది
రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతమైనది.
రెండు ఉన్నాయి: ఒకటి ప్రపంచం, రెండు బ్రహ్మాండం
మొదటిది పాంచభౌతిక జ్ఞానేంద్రియాలతో గ్రాహ్యం
రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతం తో గ్రాహ్యం
అంటే, దివ్యచక్షువు తో మాత్రమే పొందగలిగేది.
రెండూ ఉన్నాయి : మొదటిది ప్రాపంచికత, రెండవది ఆధ్యాత్మికత
ప్రాపంచికత భౌతిక కాయానికి సంబంధించినది;
ఆధ్యాత్మికత ఆత్మకు సంబంధించినది.
రెండు ఉన్నాయి : ఒకటి సంసారం, రెండు నిర్వాణం
సంసారం అనేది ప్రకృతి తో సంసారం, నిర్వాణం అన్నది కేవల పురుష అనుభవసారం
రెండు ఉన్నాయి, కనుక మనిషి రెండింటినీ పొందాలి
ఏ ఒక్కదాని వెంట మాత్రమే వుండకూడదు : రెండు సమగ్రంగా ఉంటేనే పరిపూర్ణత
రెండు ఉన్నయి: ఒకటి ధర్మం, రెండు ధ్యానం
ధర్మం చక్కటి ప్రాపంచికతను సాధింపజేస్తుంది
ధర్మం చక్కటి సంసారాన్ని ప్రసాదిస్తుంది.
అలాగే, ధ్యానం చక్కటి ఆధ్యాత్మికతను సాధింపజేస్తుంది
ధ్యానం కేవల అనుభూతిని కలుగజేస్తుంది
రెండు ఉన్నాయి. కనుక, రెండింటి లోనూ నిష్ణాతులమవ్వాలి
ధర్మానుష్ఠానం ద్వారా సంసారం లోనూ –
మరి ధ్యానానుష్ఠానం ద్వారా నిర్మాణం లోనూ