రామాయణం
రామాయణం అంటే శ్రీరాముడి కథ.
శ్రీరాముడి కథ అంటే ఒక్కటే – పితృ వాక్య పరిపాలన.
పిరమిడాయణం.
పిరమిడాయణం అంటే పిరమిడ్ మాస్టర్ల కథ.
పిరమిడ్ మాస్టర్ల కథ అంటే – సత్యవాక్ పరిసాధన …
వాక్కులు మూడు రకాలు,
1. చెడు వాక్కులు 2. మంచి వాక్కులు 3. సత్యవాక్కులు.
పిరమిడ్ మాస్టర్లందరూ సత్యవాక్ పరిసాధకులు.
ఆత్మ గురించి మాట్లాడేవే సత్యవాక్కులు.
ఆత్మానుభవం నుంచి వచ్చేవే సత్యవాక్కులు.
అందరినీ ఆత్మలుగా సంభోధిస్తూ పలికే పలుకులే సత్యవాక్కులు …
సత్యం శరణం గచ్ఛామి.
సత్యవాక్యం శరణం గచ్ఛామి.
సత్యవాక్ అభ్యాసం శరణం గచ్ఛామి…