రమతే బాలోన్మత్తవ దేవ
ధ్యానం లో విజయం సంపాదించాం.
ధ్యాన విజయులమయ్యాం ; తర్వాతేమిటి? ఆనక మన పరిస్థితి ఏమిటి?
ఆ తర్వాత ఉన్నదే రమతే బాలోన్మత్తవ దేవ .
యోగి అయిన వాడు అంటే అర్థం ధ్యానం లో విజయుడైనవాడు అని.
జ్ఞానాన్ని సముపార్జించినవాడు అంటే అర్థం తానే అంతటా ఉన్నాను అని ఎరిగిన వాడు.
తాను కాకుండా వేరొకటిది లేదు అని అనుభవానికి వచ్చినవాడు.
అంటే, ఇక అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా, లేదా ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా తానే ముల్లు, తానే అరిటాకు కనుక, క్రింద పడ్డా, మీద పడ్డా తానే గెలిచినట్లు అన్నమాట. అదీ విజయం అంటే ; అప్పుడిక మిగిలిందేమిటి, ఎల్లవేళాలా అందోళనా రహితంగా సుఖించటం తప్ప …
చిన్న పిల్లలు సదా కేరింతలు కొడుతూ ఉన్నట్లు, పిచ్చివాడు ఎప్పుడూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వున్నట్లుగా వుండడం తప్ప.
… ఇదే, రమతే బాలోన్మత్త దేవ అంటే.
… కభీ హసే, ఔర్ కభీ మూన్ మే రహ్ జాయే, పర్ దుఃఖిత్ కభీ న హోయే.