రాక్షసులు మానవులు  దేవతలు

 

మానవులలో మూడు వర్గాల వారు వున్నారు :
(1) రాక్షసులు (2) మానవులు (3) దేవతలు
“రాక్షసత్వం లో ఉన్నవారు రాక్షసులు
“రాక్షసులు” అంటే . . “హింసయే నా పరమ వాంఛ అన్నవారన్నమాట.

జంతువధ చేసేవారందరూ మాంసభక్షకులు అందరూ మరి రాక్షసులే.
రాక్షసులే ప్రస్తుత భూ దారిద్ర్యానికే, గందరగోళానికీ మూలకారణం
అయితే తెలుసుకోవలసింది ఏమిటి అంటే మన రాక్షసత్వమే మనకు అష్టదరిద్రాలు కలిగిస్తుంది

“మానవులు” అనబడేవారు అహింసాత్మకులు; “అహింసో పరమ ధర్మః”
అన్న బుద్ధ సూత్రాన్ని దైనందికంలో ఆకళింపు చేసుకున్నవారు జీవహింస
మానడమే, మాంసాహారం త్యజించడమే మరి ‘మానవత్వం’
ఇకపోతే,
“విద్వాంసో హి దేవాః”
అన్న శతపధ బ్రాహ్మణ వేదోక్తి ప్రకారం,

వేదంలో “విద్వాంసు” లకు “దేవతలు” అని పేరు.
విద్వాంసులు అంటే విద్యావంతులు అన్నమాట
“విద్య” అంటే “ఆత్మవిద్య“

ముందుగా “రాక్షసత్వం” పోగొట్టుకోవాలి
* పరంపరగా “మానవత్వం” కల్పించుకోవాలి
* ఆ పైన “దైవతం” సంపాదించుకోవాలి