పిరమిడ్ సూక్తులు

 

 

కూసంత శ్వాస – కొండంత సంజీవిని
నోటి లోని మాటే – నుదుటి మీది వ్రాత
నోటి లోంచి బొగ్గులాంటి మాటలు వస్తే – నుదుటి మీద బొగ్గులాంటి వ్రాతలు.
నోటి లోంచి బంగారు మాటలు వస్తే – నుదుటి మీద బంగారు వ్రాతలు.
నోటి లోంచి వజ్రపు తునకలు వస్తే – నుదుటి మీద వజ్రపు వ్రాతలు.
సకలప్రాణికోటితో మిత్రత్వం – దాని పేరు బుద్ధత్వం.

ఓర్చుకున్నంతే – నేర్చుకున్నంత
నేర్పినంతే – నేర్చుకున్నంత
నేర్చుకున్నంతే – నేర్పు ఉన్నంత
నేర్పు ఉన్నంతే – భాగ్యమంట.

హింస ప్రబలితే – ప్రతి హింస
హంస ప్రబలితే – పరమ హంస.

ధ్యానం అనేది ఒక పుష్పం.
అయితే ధ్యాన ప్రచారం అనేది పుష్పం యొక్క సుగంధం.
సుగంధం లేని పుష్పం పుష్పమా ?
ధ్యాన ప్రచారం లేని ధ్యానం ధ్యానమా ?

భూతకాలం అన్నది వర్తమానాన్ని పీల్చి పిప్పి చేసే ప్రేత పిశాచం.
భూతకాలం వర్తమానంలో తాండవం చేస్తే వర్తమానం నిర్వీర్యం, నిష్ఫలం.
భూతకాలపు ఛాయలు వర్తమానంలో లేకపోతే వర్తమానం సవీర్యం, ఫలవంతం, జయప్రదం.
గతం విగమైతేనే వర్తమానం అవగతమవుతుంది ;
అవగతం అయిన వర్తమానమే బహుమానం.
ఉన్నది అంతా అనుభవించేందుకే,
అనుభవమే జ్ఞానం.
‘ఉన్నదంతా’ అంటే?
‘ఉన్నదంతా’ అంటే కలిమి గానీ, లేమి గానీ,
మానం కానీ, అవమానం కానీ,
జయం కానీ, అపజయం కానీ,
జరా కానీ, మరణం కానీ.

  • సకల ప్రాణికోటి తో మిత్రత్వం – దాని పేరు బుద్ధత్వం