పిరమిడ్ మాస్టర్లకి జేజేలు
మైడియర్ పిరమిడ్ మాస్టర్స్, అండ్ ఫ్రెండ్స్,
మనభూమి ఓ నూతన శకంలోకి అడుగిడుతోంది.
భూమి ఫోటాన్ బాండ్ లోకి ప్రవేశిస్తోంది.
ఫోటాన్ బాండ్ అనేది అత్యున్నత శక్తి ప్రవాహం.
26,000 ల ఏండ్లకోసారి ఫోటాన్ బాండ్ లోకి సౌర వ్యవస్థ యొక్క ఆగమనం సంభవిస్తుంది.
ఈ సారి 1987 వ సంవత్సరం నుండి ఈ అద్భుతం సంభవమవడం ప్రారంభమైంది. ఈ చర్య 2012 వ సంవత్సరాని కల్లా పరిపూర్తి కావడం జరుగుతుంది. ప్రస్తుత సంవత్సరమైన 2004 ఫోటాన్ బాండ్లొ ఆల్రెడీ కొనసాగుతోంది. దాంతో ఈ సరికే అత్యంత శక్తివంతమైన విశ్వకిరణాలతో పృధ్వి మునిగి తేలుతోంది.
వాన కురుస్తున్నప్పుడు చేతిలో పాత్ర వుంటే తప్ప వాన నీటిని పట్టుకోలేం. అసలు వర్షమే లేకపోతే మనం పాత్ర పట్టుకు తిరిగినా ఫలితం శూన్యమే కదా. ప్రతి ఒక్కరూ ధ్యానం అనే పాత్రలో ఆ అపార విశ్వశక్తిపాతాన్ని గ్రోలడానికి సమాయత్తం కావాలి.
ఖాళీ మైండ్ – ఖాళీ కప్పు లాంటిది. అప్పుడే అది విశ్వశక్తిని నింపుకోవడానికి అనువు.
ధ్యానం అంటే మస్తిష్కాన్ని ఖాళీ చేసుకోవడమే.
ప్రస్తుతం భూమ్మీద నూతన శకం అంతా ధ్యానం యొక్క వినూత్న శకమే.
పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆ నూతన శకం ముద్దు బిడ్డలే.
పిరమిడ్ అనేది జగత్ వ్యాపితంగా నూతన శకానికి ప్రతీక.
‘పిరమిడ్స్’ కు జై.
‘నూతన శకాని’ కి జై
‘ధ్యానం’ కి జై
‘శ్వాస’ కి జై.
‘ధ్యాన గురువుల’ కు జై
‘పిరమిడ్ మాస్టర్స్’ కి జై.