పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు

 

  ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడానూ ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఒక్క క్షణం కూడానూ ఆ నవరత్నాలను మస్తిష్కంలోంచి జారిపోకూడదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. రోజు రోజుకీ వాటి యొక్క అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వుండాలి. ఒక్కటేసారి వాటి యొక్క పూర్తి అవగాహన రాదు. “తినగ తినగ వేము తియ్యగనుండు; అనగ అనగ రాగము అతిశయిల్లును”. అదేవిధంగా ఈ యొక్క మూల సిద్ధాంతాలను గురించి మనం అనేక పుస్తకాల ద్వారా, అనేక ధ్యాన సాధనల ద్వారా, ఎంతో ఆలోచన ద్వారా, అందరి యొక్క అనుభవాలు వినడం ద్వారా ఏదో ఒకరోజు ఆ యొక్క, ఆ ఫిలాసఫీ యొక్క, ఆ పూర్ణ జ్ఞాన ప్రకాశం యొక్క పూర్తి రూపురేఖలు మనకి కూడా అనుభవానికి వస్తాయి. అప్పుడు మనం కూడా ఒక ‘పిరమిడ్ మాస్టర్’ అయినట్లు.

మెట్టమొదటిది “నేనే అంతా”
రెండవది “జీవుడే దేవుడు”
మూడవది “దేహమే దేవాలయం”
నాల్గవది “శ్వాసే గురువు”
ఐదవది “సమయమే సాధన”
ఆరవది “సహనమే ప్రగతి”
ఏడవది “అనుభవమే జ్ఞానం”
ఎనిమిదవది “దానమే ధర్మం”
తొమ్మిదవది “ధర్మమే పుణ్యం”