పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం
1. ఆసనం | 4. ధారణ | 7. యమం | ||
2. ప్రాణాయామం | 5. ధ్యానం | 8. నియమం | ||
3. ప్రత్యాహారం | 6. సమాధి |
ఆసనం “స్థిర సుఖం ఆసనం “ స్థిరమైన, సుఖదాయకమైన ఆసనాన్ని గ్రహించటం ; కళ్ళు మూసుకోవడం ; చేతివ్రేళ్ళు కలిపి పెట్టుకోవడం |
ప్రాణాయామం సహజ ఉచ్ఛ్వాస, నిశ్వాసలను ప్రశాంతంగా గమనిస్తూ వుండడం ; కుంభకం కూడదు ; చిత్తవృత్తులు శూన్యం అవుతూండడం గమనించడం |
ప్రత్యాహారం మనస్సు శూన్యం కాగా, ప్రాణమయకోశంలోకి విశ్వమయప్రాణశక్తి ప్రవహిస్తూ వుంటుంది ; తద్వారా జరిగే నాడీమండలశుద్ధిని గమనిస్తూ వుండడం |
ధారణ విశ్వమయప్రాణశక్తి ప్రవాహంతో పాటు అంతర్ముఖంగా దివ్యచక్షువుతో అనుభూతమౌతున్న అనుభవాలను శ్రద్ధగా గమనించటం, ఆస్వాదించటం |
ధ్యానం క్రమక్రమంగా సూక్ష్మశరీరం విడివడడం గమనిస్తాం ; గాఢ ధ్యాన అవస్థలలో కారణశరీరం కూడా విడిపడుతుంది ; ఆ యా లోకాలు అనుభూతమవుతూంటాయి |
సమాధి దీర్ఘకాల సూక్ష్మశరీర, కారణశరీర యానాల ద్వారా ఆత్మయుత సమాధానాలన్నింటినీ పొందగలగడం సవికల్ప నిర్వికల్ప సమాధి స్థితులను పొందడం |
“యోగః చిత్తవృత్తి నిరోధః”
సవికల్ప సమాధి ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నింటికీ అంతరాత్మ నుంచి సమాధానాలు కొద్దికొద్దిగా పొందుతున్న స్థితి |
నిర్వికల్ప సమాధి ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నింటికీ అంతరాత్మ నుంచి సమాధానాలు సంపూర్ణంగా లభ్యమైన స్థితి |