ప్రేయో మార్గం, శ్రేయో మార్గం
రెండు మార్గాలు ఉన్నాయి.
1) ప్రేయో మార్గం 2) శ్రేయో మార్గం
మనస్సుకు నచ్చినది ప్రేయో మార్గం;
బుద్ధికి నచ్చినది శ్రేయో మార్గం.
ఆత్మజ్ఞానం లేని వారికి బుద్ధి ఉండదు.
ఆత్మానుభవం వున్న వారికి మనస్సు ఉండదు; బుద్ధి ఉంటుంది.
ఆకలి లేకపోయినా తినవచ్చు తినాలి అంటుంది మనస్సు;
అకలి ఉన్నప్పుడే తినాలి అంటుంది బుద్ధి.
కామక్రీడల్లో బలాత్కారం చేయవచ్చంటుంది మనస్సు;
ఇరు ప్రక్కలా పూర్తి ఇచ్చ ఉన్నప్పుడే కామక్రీడ సలపాలి అని చెప్పేది బుద్ధి.
మనస్సు చెప్పేది ప్రేయో మార్గం;
బుద్ధి చెప్పేది శ్రేయో మార్గం;
మనస్సు దుఃఖం, బుద్ధి అనందం.
మనస్సు అసత్యం; బుద్ధి శాశ్వతం.
మనస్సు అశాశ్వతం; బుద్ధి శాశ్వతం.
మనస్సు పరిపరివిధాలు; బుద్ధి ఏక విధానం.
ధ్యానం మనస్సును కట్టడి చేస్తుంది.
ధ్యానం విద్యే యోగ విద్య.
ప్రేయో మార్గంలో వుండేవాడే, మనస్సుకు లోబడి ఉండేవాడే మానవుడు:
శ్రేయో మార్గంలో ఉండేవాడే, బుద్ధికి లోబడి ఉండేవాడే బుద్ధుడు.
ప్రతి మనిషి మనస్సు నుండి బుద్ధి దగ్గరకు ప్రమోషన్ తెచ్చుకోవాలి.
ఇది ఒకరిచ్చే ప్రమోషన్ కాదు, ఎవరికి వారే సాధించుకోవాలి.
నిత్య ధ్యాన సాధన ద్వారా నలభై రోజుల్లో ఈ ప్రమోషన్ వస్తుంది –
… ఇదే పై లోకాల్లో ఉన్న అందరి బుద్ధుళ్ళ అందరి బుద్ధి జీవుల సందేశం.