“ప్రాణశక్తి సద్వినియోగం = వివేకం”
మనం శక్తిపుంజాలం We are Energy Balls మన శక్తిని సదా మనం ఖర్చు చేసేస్తూంటాం .. మళ్ళీ క్రొత్తగా శక్తిని సంపాదించుకుంటూంటాం We are always expending our Energy .. and we are always regaining our Energy నిద్రావస్థలో విశ్వమయప్రాణశక్తిని మనం మౌలికంగా సంపాదించుకుంటాం We gain cosmic Energy in our Sleep State అందుకే ప్రతి ప్రాణికీ “నిద్ర – సుషుప్తి అవస్థ – Sleep” అన్నది అత్యంత అవశ్యకం ఒక్కరోజు నిద్రలేకపోతే ఆ మరుసటిరోజు మన పరిస్థితి మరి అంతేసంగతులు! నిద్రావస్థలో మన “సూక్ష్మశరీరం” అన్నది స్థూలశరీరం నుంచి బయటికి వచ్చి విశ్వప్రాణమయశక్తిని విశేషంగా గ్రహిస్తుంది ఈ విధంగా రాత్రిపూట సంపాదించుకున్న ప్రాణశక్తిని దినసరి చర్యలలో రోజంతా మనం ఖర్చు చేసేస్తూంటాం *** అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే ఎంతటి ధనవంతుడయినా బికారి అయి తీరుతాడు అదేవిధంగా అనవసరమయిన ఆలోచనల ద్వారా .. అనవసరమయిన మాటల ద్వారా అనవసరమయిన దేహచర్యల ద్వారా మన దగ్గర నిలువ వున్న ప్రాణశక్తిని వృధా చేసుకుంటే ఎవ్వరయినా సరే శక్తిహీనులై రోగగ్రస్థులవుతారు సంపాదించుకున్న ధనాన్ని సదుపయోగం చేసుకోవాలన్నట్లు .. సంపాదించుకున్న ప్రాణశక్తిని సదుపయోగం చేసుకోవడమే “వివేకం” *** మనిషి “నిర్వినియోగి”గా ఎప్పుడూ వుండకూడదు; అంటే ప్రాణశక్తిని ఎప్పటికప్పుడు వినియోగించుకుంటూ ఉండాలి .. అంటే “అకర్ముడిగా ఎప్పుడూ ఉండకూడదు” మనిషి “దుర్వినియోగి”గా అసలే వుండకూడదు; అంటే ప్రాణశక్తిని పనికిరానివాటికోసం ఉపయోగించరాదు అంటే, “కుకర్మలు చేసేవాడిగా ఉండకూడదు” ఇంకా ముందుకుపోయి మనిషి సదా .. “సద్వినియోగి”గా ఎప్పుడూ వుండి తీరాలి; అంటే ప్రాణశక్తిని స్వహితార్థం మరి లోకకల్యాణార్థం విశేషంగా ఉపయోగించాలి .. అంటే “సుకర్మలు చేస్తూనే పూర్తి జీవితాన్ని గడపాలి” *** “నిద్ర – sleep” అన్నది ప్రతి ప్రాణికీ ప్రకృతి ఇచ్చిన మహా వరం .. అయితే దీనికి మించిన వరం .. మరి మనకు మనమే ఇచ్చుకోగలం వరం .. అదే “ధ్యానం – Meditation” “ధ్యానం” ద్వారా నిద్రకన్నా మూడింతలు మరింత అధికంగా ప్రాణశక్తిని సంపాదించుకోవచ్చు అందుకే ప్రతి మనిషీ “ధ్యానయోగి” అయ్యి తీరాలి! “ధ్యానం శరణం గచ్ఛామి” అంటూ ప్రతి మనిషీ ధ్యానాన్ని దినచర్యలలో మహా ప్రధాన భాగంగా చేసుకోవాలి. ధ్యానమే ప్రాణశక్తి యొక్క మహాసమీకరణ సూత్రం .. మరి ధ్యాన అభ్యాసమే మహా మహా ఆరోగ్యసూత్రం ఇతోధికంగా ధ్యానం చేసి ఇతోధికంగా విశ్వమయప్రాణశక్తిని సంపాదించుకుందాం అలా సంపాదించుకున్న శక్తిని బొట్టూ బొట్టూ బహు జాగ్రత్తగా రక్షించుకుంటూ స్వహితార్థం మరి సకల ప్రాణికోటి హితార్థం .. ప్రాణశక్తిని వివేకయుతంగా విశేషంగా ఖర్చు పెడదాం ప్రతి మాట ముందూ .. ప్రతి ఆలోచన ముందూ .. ప్రతి కర్మ ముందూ ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఆచి తూచి అడుగువేద్దాం Every Word .. Every Thought .. Every Action .. is very very important Indulge only in Right Speech .. Right Thoughts .. Right Deeds ధ్యానం ద్వారానే ఇదంతా సంభవం అవుతుంది అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణులవారు “అర్జునా! యోగివికా!” అన్నారు ధ్యానం ద్వారా “శక్తి” మరి “బుద్ధి” రెండూ కూడా విశేషంగా లభ్యం అవుతాయి ధ్యానం ద్వారానే జ్ఞానం .. జ్ఞానం ద్వారానే ముక్తి .. “జ్ఞానాన్ ముక్తి” అన్నారు కదా కపిల మహాముని “సాంఖ్య యోగం”లో *** ధ్యానం అన్నది బహు సులభం .. బహు సరళం “ధ్యానమేవ శరణం వయం” “ధ్యానం మాత్రమే మనకు శరణం” ధ్యాన స్థితి పొందేమార్గమే .. “శ్వాస మీద ధ్యాస” అథవా .. “సుఖమయ ప్రాణాయామం” .. అథవా .. “ఆనాపానసతి” “ధ్యానం” జిందాబాద్ .. “ధ్యానశక్తి” జిందాబాద్ యావత్ ప్రపంచానికీ ధ్యానాన్ని అందించే “PSSM” మాస్టర్స్ జిందాబాద్!