ప్రజల్ప రాహిత్యం

 

మనిషి

శారీరకంగా కానీ,

మానసికంగా కానీ,

ఆధ్యాత్మికంగా కానీ,

హీన స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలి అంటే

కావలసిన తప్పనిసరి గుణమే “ప్రజల్ప రాహిత్యం”

“ప్రజల్పం” అంటే “అసంధర్భపు ప్రేలాపన”,

“పనికిరాని మాటలు మాటలాడటం”;

“ప్రజల్ప రాహిత్యం” అంటే “పనికిరాని మాటలు లేకపోవడం” అన్నమాట.

అప్పుడు దేహం యొక్క సహజ ప్రాణశక్తిని కోల్పోము

“ప్రజల్పం” అన్నదానిని సంపూర్ణంగా కట్టిపెట్టాలి

ప్రజల్పమే మనిషిని తినివేసే క్యాన్సర్ వ్యాధి.

నోట్లోంచి ఒక్క అనవసరపు మాట కూడా రాకూడదు.

అప్పుడు బోలెడంత శక్తిని

మనలో కూడగట్టుకోవడం జరుగుతుంది

“ప్రజల్ప రాహిత్యం” అన్నది మౌలిక ఆధ్యాత్మిక సాధన

వాక్ క్షేత్రం మీద సరియైన పట్టు సాధించాలి

వాక్ క్షేత్రం సదా శాస్త్రీయంగా, కుదింపుగా ఉండాలి.

ఆ విధంగా ఆదా చేయబడిన ప్రాణశక్తే

మన శారీరక, మానసిక పరిపుష్టికీ ..

ఆధ్యాత్మిక శుద్ధతకూ … బుద్ధివికాసానికి .. ఆత్మపరాకాష్టకూ ..

క్రమక్రమంగా దోహదపడుతుంది.

 

  • ప్రజల్ప సహితుడు ఎప్పుడూ నిర్వీర్యుడే
  • ప్రజల్ప రహితుడు ఎప్పుడూ వీర్యుడే
  • భోగకామికి కానీ, మోక్షగామికి కానీ,  ప్రజల్ప రాహిత్యం అన్నది అనివార్యం.