పతంజలి అష్టాంగ యోగం

 

పతంజలి మహర్షి
ప్రవచించినదే “అష్టాంగ యోగ మార్గం” –
ఎనిమిది అంగాలు కలిగిన సాధనా కార్యక్రమం;
అవి :
యమం .. నియమం .. ఆసనం .. ప్రాణాయామం .. ప్రత్యాహారం
ధారణ .. ధ్యానం .. సమాధి
యమ, నియమాలు సిద్ధ స్థితిని సూచిస్తాయి .. ఒకానొక ధ్యాన సాధకుడు 
“ప్రాణాయామ”, “ప్రత్యాహార”, “ధారణ”, “ధ్యానం” 
అనబడే “ధ్యాన సాధనా కార్యక్రమం” ద్వారా క్రమక్రమంగా సర్వసమాధానాలు 
పొంది సంపూర్ణ సమాధి చిత్తుడయినప్పుడు అంటే, సమాధి స్థితికి ఎదిగినప్పుడు
అతనికి ఇంక యమ, నియమాలు అతి సులభం, అతి సహజం
యమ, నియమాదులు భౌతిక, సాంసారిక జీవితంలో సిద్ధత్వాన్ని సూచిస్తాయి
భౌతిక, సాంసారిక జీవితంలో సిద్ధత్వాన్ని సాధించడం కోసమే ఆధ్యాత్మిక జ్ఞానం
“ఆధ్యాత్మిక జ్ఞానం ” అన్నది చిత్తం వృత్తి రహితం అయినప్పుడే లభ్యం
చిత్తం ‘వృత్తి రహితం’ కావడానికి మొదటగా “ఆసన సిద్ధి” ని సాధించాలి 
దానితో పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ వుండాలి .. ఇదే “ప్రాణాయామం”
అప్పుడు బహిరేంద్రియాలు క్రమక్రమంగా అంతర్ముఖం అవుతాయి 
అంతర్ముఖం అయిన ఇంద్రియాల వ్యవహారాన్నే “ప్రత్యాహారం ” అంటాం
చిత్తం ఆలోచనా రహితమై అంతరేంద్రియాలు ఉత్తేజితమైనప్పుడు
అంతర్ముఖంగా ద్యోతకమవుతున్న అనేకానేక దృశ్యాలను 
శ్రద్ధగా గమనించడమే ” ధారణ “
“ధారణ” చేస్తూ వుండగా, సూక్ష్మశరీరం హఠాత్తుగా విడివడుతుంది
అదే “ధ్యానం”
సూక్ష్మ శరీర యానం ద్వారా, అంటే,
ధ్యానం ద్వారా  సమాధానాలు ‘ అన్నీ లభిస్తాయి – అదే “సమాధి” స్థితి

* పతంజలి మహర్షి ప్రణీత అష్టాంగ యోగ మార్గం .. జయహో!