పరమహంస
మానవ జన్మలో పాటించవలసినవి – రెండే రెండు.
అందులో ఒకటి వదలిపెట్టవలసినది;
రెండవది చేపట్టవలసినది.
వదలి పెట్టేయవలసింది హింస;
మానవుణ్ణి దానవునిగా చేసేది – హింస;
చేపట్టవలసింది – హంస
హంస అంటే శ్వాస;
మానవుణ్ణి దానవునిగా చేసేది – హింస
మానవుణ్ణి దివ్యునిగా చేసేది – హంస;
ప్రతి యోగి ఒక పరమహంస.
నిత్యయోగ సాధకులే పరమహంస లు కాగలరు.
పిరమిడ్ సాధకులే పరమ హంసలు.
పిరమిడ్ మాస్టర్లందరూ పరమ హంసలు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరినీ ఇక హంసలుగా పరమహంసలు గా మార్చడానికి కంకణం కట్టుకున్నాయి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలు.
హంస ను అనుసరిద్దాం ; పరమహంస లవుదాం.