పాపం – పుణ్యం  జ్ఞానం

 

ధమ్మపదం లో

బుద్ధుడు చెప్పాడు

“ఇద సోచతి, పెచ్చ సోచతి, పాపకారీ ఉభయత్థ సోచతి . .

ఇథ మోదతి, పెచ్చ మోదతి, కతపుజ్ఞ ఉభయత్థ మోదతి” (పాళీ భాష)

“పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు ;

పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు”

పాపం = అజ్ఞానం, అధర్మాచరణం వలన

పుణ్యం = ధర్మాచరణం వలన

దివ్యజ్ఞానం = ధ్యానం వలన

అధర్మాచరణ వలన ఈ లోకం లోనూ, పరలోకాల్లోనూ,

దుఃఖప్రాప్తి, మరి తిరిగి జననం కలుగుతాయి;

ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ,

సుఖప్రాప్తి లభిస్తుంది;

అయితే, తిరిగి జననం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది

“క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్నారు కదా గీతాచార్యులు కానీ,

దివ్యజ్ఞానప్రకాశం వలన ఈ లోకంలోనూ, పరలోకాల్లోనూ

అఖండానంద ప్రాప్తితో పాటు జన్మరాహిత్యస్థితి కూడా లభిస్తుంది

  • కనుక, మన దినచర్యలన్నింటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ, మిగిలిన సమయాన్ని దివ్యజ్ఞానప్రకాశ సంప్రాప్తికి వెచ్చించాలి; అలా జీవితం మొత్తం గడపాలి; అదే సరియైన జీవితం