పాపాలు వ్యాధులు

 

పూర్వజన్మలలో

చేసిన పాపాలే

ఈ జన్మలో వ్యాధులుగా అవతరిస్తాయి

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే”

అని కదా లోకోక్తి

మనం చేసిన పాపకర్మలే మళ్ళీ మళ్ళీ మన కాళ్ళకు చుట్టుకుంటూ వుంటాయి

జీవిత చేదు అనుభవాల ద్వారానే జ్ఞానపాఠాలు నేర్చుకుంటాం

జ్ఞానపాఠాలు నేర్చుకుంటేనే వ్యాధులు మౌలికంగా మాయమవుతాయి.

“అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ :

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి”

– భగవద్గీత (4:46)

అంటే,

“నువ్వు అందరికన్నా హీనాతిహీనమైన

పాపాత్ముడవయినా, ‘జ్ఞానం’ అనే గాలి వీచడం

వలన సర్వపాపాలూ, సర్వరోగాలూ అంతరించిపోతాయి” అని

“జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం” . . అన్నారు కదా గీతాకారులు

ఆత్మజ్ఞానం వలన పూర్వపు సంచిత పాపకర్మ అంతా దగ్ధం అవుతుంది

ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం వస్తుంది కదా

అనుభవిస్తున్న వ్యాధుల నుంచీ, మరి రాబోయే వ్యాధుల నుంచీ

శాశ్వతంగా తప్పించుకోవాలి అంటే . . ధ్యానమే ఏకైక శరణ్యం

డాక్టర్ల వలన కానీ, మందుల వలన కానీ, వ్యాధుల పోవు గాక పోవు

లేని జబ్బులను కూడా నిజానికి అ విషతుల్య మందులు తీసుకుని వస్తాయి

రోగాలకు మూలం పాపకర్మలు

పాపకర్మలకు మూలం అవిద్య

అవిద్యను నాశనం చేసేది ధ్యానమే, ఆత్మజ్ఞానమే