పండితుడు
“ఆత్మజ్ఞానం సమారంభ స్తితిక్షా ధర్మ నిత్యతా,
యమర్థా నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే”
= వ్యాస మహాభారతం
“ఆత్మజ్ఞానం కలవాడు –
నిష్కర్మత, ఆలస్యం లేకుండా పనులను ప్రారంభించేవాడు –
సుఖదుఃఖాలు, హానిలాభాలు, మానావమానాలు, నిందాస్తుతులు వీటన్నింటినీ పొంది కూడా హర్ష శోకాలకు లోనుకానివాడు –
ధర్మంలోనే నిత్యమ్ నిశ్చయంగా ఉండేవాడు –
ఉత్తమోత్తమ పదార్థాల, విషయ వస్తువుల ఆకర్షణకు లొంగని మనస్సు కలవాడే ‘పండితుడు’. “
= దయానంద – గోపదేవ్ ఆధారంగా
“పండితుడు” అంటే వ్యాసుని దృష్టిలో
కేవలం శాస్త్రపఠనం చేసి శ్లోకాలు వల్లెవేయగలిగినవాడు కాదు;
అతడు ఆత్మజ్ఞాని, యోగి, సకల గుణరాశి