పంచేంద్రియాలు
ఈ ప్రపంచాన్ని మనము దేనితో లోపలికి లాగుతున్నాము? కళ్ళతో, చెవులతో, నాసికతో … అంటే ఇంద్రియాలతో లాగుతున్నాము. పంచేంద్రియాలు .. అంటే జ్ఞానేంద్రియాలతో లాగుతున్నాము. వాటిలో ముఖ్యమైనది నయనేంద్రియం అంటే కన్ను. కళ్ళకు రెప్పలు ఎందుకున్నాయంటే కళ్ళు తెరవడానికి, మూయడానికి. చెవులకు రెప్పలు వున్నాయా? లేవు. ఎందుకంటే చెవులకు సమస్య లేదు. కళ్ళకే సమస్య వుంది కనుక కళ్ళకు రెప్పలు వున్నాయు. కళ్ళతో ఏమి సమస్య అంటే మనం పనికిరానివన్ని చూస్తూనే వుంటాము. కనుక కనురెప్పలు ఎందుకున్నాయంటే అవసరమైనప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. అవసరం లేనప్పుడు కనురెప్పలతో కళ్ళను మూసేయండి. 80% ఈ ఆత్మ యొక్క శక్తి కళ్ళలో నుండి బయటకి వెళుతుంది. ఈ శక్తిని పనికొచ్చేవాటికి మాత్రమే ఉపయోగించాలి, పనికిరానివాటికి కనురెప్పలతొ మూసేయాలి. ఉదాహరణకు ఎవరైనా ఇద్దురు కొట్టుకుంటున్నారు, ఏదో పిచ్చిగా కొట్టుకొంటున్నారు. నేను వారివైపు చుడాలా వద్ద? చూడకూడదు, వారిద్దరు కొట్టుకుంటుంటే నాకెంటి అవసరము? అంటే అవి పనికిరాని విషయం, చూడకూడని విషయం. నువ్వేంచేయాలి, నువ్వు కళ్ళు ముసుకొని ధ్యానంలొ కూర్చోవాలి.
మీ చెవులు ఎప్పుడూ చక్కటి సంగీతాన్నే వినాలి. మీ కళ్ళు ఎప్పుడూ చక్కటి దృశ్యాలనే చూడాలి. మీ చెవులు ఎప్పుడూ చెత్త మాటలు వినకూడదు. మీ కళ్ళు ఎప్పుడు చెత్త ద్రుశ్యాలు చూడకూడదు. మీ పనులు మీవే. మీ పనులు అయిన తరువాత మీ ధ్యానంలో మీరు నిమఘ్నం కావాలి. ఎందుకంటే మీరుకూడ ఒక వాల్మీకిలా, ఒక వేద వ్యాసుడిలా కావాలి.
కనుక గుర్తుంచుకోండి, పక్కింటి విషయాలు మీకు చెత్త. అలాగే, మీ ఇంటి విషయాలు పక్కింటివారికి చెత్త. మీ ఇంటి కాకి పక్కింట్లొ వాలకూడదు. పక్కింటి కాకి మీ ఇంట్లొ వాలకూడదు. ఇవన్నీ మీకు సాధారణ విషయాలుగా కనిపించ వచ్చును. కానీ ఇవి చాలా చాలా పెద్ద విషయాలు ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక ప్రయణంలో ఎవరి ఇంటి విషయాలు వారికే పరిమితం. పక్క ఇంట్లో చావు మనకు అనవసరం. పక్క ఇంట్లో పెళ్ళి మనకు అనవసరం. కాని, వారి ఇంట్లో ధ్యానం వుంటే మాత్రం తప్పకుండా వెళ్ళాలి.