పంచ వింశతి

 

‘వింశతి’ అంటే వందలో ఐదవ భాగం

‘పంచ’ అంటే అయిదు

కనుక, ‘పంచ వింశతి’ ఆంటే ‘ఇరవై అయిదు’

పురుష-ప్రకృతి కలయికే ‘సృష్టి’

ఇరవై అయిదు తత్వాలతో కూడుకుని వుంది ఈ ‘సృష్టి’.

‘పురుషుడు’ అంటే మూలచైతన్యపు శకలం-అంటే ‘జీవుడు’

అంటే, ‘జీవాత్మ’ లేక ‘అంశాత్మ’ అన్నమాట

పురుషుడి యొక్క సంఖ్య – ఒకటి

ఇరవై నాలుగు తత్వాలతో కూడుకుని వున్నది ‘ప్రకృతి’

ప్రకృతిలో ప్రవేశిస్తూ జీవుడు మూడు తొడుగులను ధరిస్తాడు – అవి:

1)కారణ శరీరం 2) సూక్ష్మ శరీరం 3) స్థూల శరీరం

కారణ శరీరం యొక్క సంఖ్య – 2: అవి = ‘చిత్తం’ + ‘అహంకారం’.

సూక్ష్మ శరీరం యొక్క సంఖ్య – 17; అవి = పంచ తన్మాత్రలు + పంచ

జ్ఞానేంద్రియాలు + పంచ కర్మేంద్రియాలు + మనస్సు + బుద్ధి

( ‘తన్మత్ర’ అన్నవి పంచ మహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలు)

స్థూల శరీరం యొక్క సంఖ్య – 5; అవే పంచ మహాభూతాలు

కనుక, ఈ భౌతిక లోకంలో భౌతిక దేహధారి అయిన జీవుడి సంఖ్య ‘పంచ విశంతి’ = 1+2+17+5=25

మనిషి భౌతికపరంగా చనిపోయినప్పుడు అతని సంఖ్య = 25_5=20 అవుతుంది

సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలకు పోయినప్పుడు అతని సంఖ్య = 20_17=3 అవుతుంది

ఆత్మజ్ఞానం కలిగినప్పుడు – అంటే, అహంకారం నశించి

చిత్తం పరిశుద్ధమయినప్పుడు అతని సంఖ్య =3_2=1 అవుతుంది

అప్పుడు ఇక హాయిగా అద్వైతంగా, పురుషోత్తముడిగా,

పరమాత్ముడిగా, శాశ్వతంగా విలసిల్లుతాడు.

 

  • ఇదే కపిల మహాముని ప్రణీత సాంఖ్యయోగ సారాంశం